KTR Amtech Meet : రాబోయే రోజుల్లో త్రీడీ ప్రింటింగ్ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రం - ఆమ్టెక్స్ ఎక్స్‌పోలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !
హైదరాబాద్ త్రీడీ ప్రింటింగ్ పరిశ్రమకు కేంద్రంగా మారుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
KTR Amtech Meet : హైదరాబాద్ రాబోయే కాలంలో 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కానుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో జరిగిన ఆమ్టెక్ ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం 3డీ ప్రింటింగ్, ఆవిష్కరణ రంగంపై ప్రధానంగా దృష్టి సారించిందని ప్రకటించారు. భారత్‌లో టెక్నాలజీని అభివృద్ధి చేసి విదేశాలకు అందించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మెడికల్, ఇండస్ట్రీ రంగాల్లోనూ 3డీ ప్రింటింగ్ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నదన్నారు.
Minister @KTRTRS delivered inaugural address at AMTECH Expo, the largest Additive Manufacturing Expo in India.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2022
Addressing the gathering, the Minister said Telangana has always been a key supporter for innovation by our startups, industry, & academia. #InvestTelangana pic.twitter.com/mZ5PGSblTM
ఇటీవల హైదరాబాద్ సంస్థ ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపిన విషయాన్నికేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ ఇటీవల వార్తల్లో నిలిచిందని, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ త్రీడీ ప్రింటెడ్ ఇంజిన్‌తో కూడిన ఓ ప్రవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిందని మంత్రి గుర్తుచేశారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంగా అది గుర్తింపు పొందిందని చెప్పారు. వివిధ పరిశ్రమలు, పరిశోధన సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు.. తెలంగాణ ప్రభుత్వాన్ని తమ పారిశ్రామిక భాగస్వామిగా చేసుకోవాలని మంత్రి కోరారు. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మంచి స్పేస్ ఉందని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్, వైద్య పరికరాలు తదితర సదుపాయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేటీఆర్ గుర్తు చేశారు. స్టార్టప్‌లకు, నూతన ఆవిష్కరణలకు, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సహం ఇస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు, సహకారంతో రాష్ట్రంలో టీ-హబ్, టీఎస్‌ఐసీ, వీ-హబ్, టాస్క్ వంటి స్టార్టప్‌లతో సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందినదన్నారు.భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి చేసి విదేశాలకు అందిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడికల్, పరిశ్రమ రంగాల్లోనూ ఈ త్రీడీ ప్రిటింగ్ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రకటించారు.
ఆమ్టెక్స్ ఎక్స్‌పో రానున్న రెండు రోజులు దేశవిదేశాలకు చెందిన 100కు పైగా పరిశ్రమలు, 50కి పైగా స్టార్టప్‌లు, 15కు పైగా నేషనల్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు, 3000 మందికి పైగా ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు. ఈ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోంది.
ఏడాదిగా సమైఖ్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు - గుత్తా సంచలన వ్యాఖ్యలు