అన్వేషించండి

ప్రధాని తెలంగాణ విరోధి! మాపై విషం చిమ్మడం ఏం సంస్కారం?: ఏపీ విభజనపై మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Fires On PM Modi: ఏపీ విభజన వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు సంతోషంగా లేరని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

KTR Fires On PM Modi:
పాత పార్లమెంట్ భవనం గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. విభజన నాటి పరిస్థితులపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన పని వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రధాని మోదీ తెలంగాణ విరోధి అని, తెలంగాణ మీద పదే పదే అదే అక్కసు ఎందుకని ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా. తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం.. అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు అని తీవ్రంగా స్పందించారు. పద్నాలుగేండ్లు పోరాడి.. దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ పట్ల మోదీకి ఎందుకంత చులకన భావం ఉందన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు. 

వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని మీ కేంద్రమంత్రి మా రైతుల్ని కించపర్చారు. ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా. మీలాగే మీ మంత్రులు ఉన్నారు. మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వరు. కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించాలని హితవు పలికారు. కోటి ఆశలు, ఆకాంక్షలతో  పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా ఆది నుంచి కక్షను పెంచుకొని.. వివక్షనే చూపిస్తున్నారు. ఏడు మండలాలు గుంజుకొని, లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం అన్నారు. 

నీతి ఆయోగ్‌ చెప్పినా  నీతిలేకుండా మిషన్ కాకతీయ, భగీరథలకు నిధులను నిరాకరించిన ఎన్డీఏ నిర్వాకాన్ని ఏమనాలి. కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా  అర్థంచేసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారు. దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా అని ప్రశ్నించారు. 
 
157 మెడికల్ కాలేజీల్లో మాకు ఒక్కటి కూడా ఇవ్వకుండా గుండుసున్నా చేసారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపం ఉందోనన్నారు. పైన అప్పర్ భద్ర.. కింద పోలవరం, ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చారు కానీ మధ్యలో తెలంగాణకు మొండిచేయి చూపించారు. మేం చేసిన పాపమేంది. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి.. గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి, ఆదివాసులపై ఎందుకు కక్షసాధిస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు.

సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేస్తరు. ఐటీఐఆర్‌ను రద్దు చేస్తరు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తున్నారు. అడుగడుగునా దగా.. ప్రశ్నిస్తే పగ. జుమ్లా హమ్లా డబుల్ ఇంజన్‌ సర్కారు మీది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఈడీ, ఐటీ, సీబీఐలను ఎన్డీయే కూటమిలో చేర్చుకొని ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న మీరు ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే మీకు తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అన్నారు. 

తెలంగాణ పుట్టిన రోజు మా అందరికీ పండుగరోజు 
అడ్డగోలుగా విభజన చేశారని ఒకసారి.. తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోసారి.. తెలంగాణలో సంబరాలు జరగనే లేదని ఇంకోసారి అంటున్నారు. ఇలా ఎన్నిసార్లు పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారని ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. మా దశాబ్దాల కల నెరవేరిన నాడు… అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? అన్నారు. నాటి ఉత్సవం నుంచి.. నేటి దశాబ్ది ఉత్సవం వరకూ ప్రతి తెలంగాణ పుట్టిన రోజు మా అందరికీ పండుగరోజు అని స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget