By: ABP Desam | Updated at : 06 May 2023 10:39 AM (IST)
Edited By: jyothi
ఈనెల 10న కృష్ణా బోర్డు సమావేశం, చర్చ దేని గురించంటే?
Krishna Board Meeting: కృష్ణా నదీ జలాల్లో వాటాల పంపకాలపై ఈనెల 10వ తేదీన సమావేశం జరగనుంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణా జలాల్లో చెరి 50 శాతం చొప్పున నీటి పంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రాబోతున్నాయి. 2022-23 వాటర్ ఇయర్ లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తి కానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటి వరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా, చివరలో బోర్డు ఛైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అయినా సమావేశంలో గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా ఆక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడి కాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ముఖ్యాంశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో అవసరం లేకున్నా తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్ మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫార్సుల అమలుపై కూడా చర్చించనున్నారు. జల విద్యుత్ ఉత్పాదన, రూల్ కర్వ్ మిగులు జలాల నిర్ధారమ వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. అంతే కాకుండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్ తో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగామ రూ.1450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి.
ఫిబ్రవరిలో శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యులు
నూతనంగా నియమితులైన కృష్ణా రివర్ బోర్డు కమిటీ సభ్యుడు, అధికారులు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు. కృష్ణా బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తాతో పాటు కేఆర్ఎంబీ ఎస్సీ అశోక్ కుమార్ ఈఈ శంకరయ్యలు డ్యామ్ ను పరిశీలించి... జలాశయానికి సంబంధించిన ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను డ్యామ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయానికి సంబంధించిన గేట్స్, గ్యాలరీ, రోప్స్ ను పరిశీలించి వాటి పనితీరు తదితర వివరాలను గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. డ్యామ్ ను పరిశీలించిన అనంతరం ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి జెన్ కో అధికారులతో కాసేపు ముచ్చటించారు. అన్ని వివరాలు అడుగుతూ చాలా సేపు చర్చించారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాం నీటి నిల్వలు ఆంధ్ర, తెలంగాణ నీటి వాటలాపై అధికారులతో చర్చించమని సూచించారు. జలాశయంలోని అడుగు భాగంలో ఉన్న గ్యాలరీ డ్యాం గేట్లుకు ఉన్న రోప్ లను.. స్పిల్ వే వాటి పటిష్ఠతపై డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు.
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్