క్షమాపణలు చెబితే సరిపోదు రేవంత్- శాంతించని కోమటి రెడ్డి
కోమటి రెడ్డి సోదరులపై అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌లో సంచలనంగా మారుతున్నాయి. పరిస్థితిని చల్లబరిచేందుకు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పారు. కానీ కోమటి రెడ్డి అంగీకరించ లేదు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి శాంతించడం లేదు. దీంతో మునుగోడు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. సొంతపార్టీ నేతల మధ్యే నెలకొన్న వివాదం ఏ తీరానికి చేరుతుందో అన్న సస్పెన్స్ నెలకొంది.
చుండూరు బహిరంగ సభలో ఎంపీ కోమటి రెడ్డి సోదరులపై కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పెను సంచలనంగా మారుతున్నాయి. పరిస్థితిని చల్లబరిచేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు. కానీ కోమటి రెడ్డి మాత్రం అంగీకరించడం లేదు.
ఇప్పటికే కొందరు సీనియర్లు ఈ దూకుడును తప్పుపడుతుండగా... ఇప్పుడు కోమటి రెడ్డి మరింత దూకుడుగా వెళ్తున్నారు. తనపై కామెంట్స్ చేసిన వారిని కచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు. తనకు కావాల్సింది రేవంత్ రెడ్డి క్షమాపణలు కాదని... అద్దంకి దయాకర్‌పై చర్యలు మాత్రమేనంటూ చెబుతున్నారు.
పార్టీ నుంచి అద్దంకి దయాకర్‌ను సస్పెండ్ చేస్తేనే మునుగోడులో ప్రచారానికి వెళ్తానన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చిన్న పిల్లాడితో తిట్టింది సారీ చెప్తే సరిపోదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్‌ను సస్పెండ్ చేయాలన్నారు. మునుగోడులో ప్రచారానికి తనకు ఆహ్వానం లేదన్నారు. పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని సెటైర్లు వేశారు.
రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పిన వెంటనే అద్దంకి దయాకర్ కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. తాను బహిరంగ సభలో మాట్లాడిన మాటలపై పశ్చాతాపం వ్యక్తం చేశారు. తాను అభ్యంతరకర మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. భవిషత్యత్‌లో ఇలాంటి కామెంట్స్ చేయబోమన్నారు దయాకర్.
రేవంత్ రెడ్డి క్షమాపణలు
ఈ ఉదయం వీడియో రిలీజ్ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్‌కు సారీ చెప్పారు. ఇలాంటి భాష వాడటం మంచి పద్దతి కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేస్తున్న క్రమశిక్షణ కమిటీ చర్యలపై ఆలోచిస్తోందన్నారు.
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022
అసలు ఏం జరిగింది అంటే...
మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి సోదరులు అమ్ముడుపోయారంటూ మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా అద్దంకి దయాకర్ మాట్లాడారు. దయాకర్ చేసిన అసభ్యకర కామెంట్స్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అప్పుడే ప్రారంభైంది. కాస్త ఘాటైన పదాలు వాడటంతో ఈ అంశం వివాదాస్పదమైంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరు పడిన కొంత మంది సీనియర్ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు.