Kishan Reddy letter : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా - సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక లేఖ
Metro project: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో ధశను పట్టాలెక్కించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఏం చేయాలో చెబుతూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

Kishan Reddy letter to CM Revanth Reddy: భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అధికారిక లేఖ రాశారు. ఇటీవల తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యానని, మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అధికారుల కమిటీ ఏర్పాటు - రాష్ట్రానికి కేంద్రం పిలుపు
మెట్రో రెండో దశ పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఉంటుంది. ఈ కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదించే ఇద్దరు అధికారుల పేర్లను వెంటనే పంపాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఈ కమిటీ ప్రాజెక్టు రూపకల్పన, నిధుల కేటాయింపు మరియు అమలు తీరుపై తుది నిర్ణయాలు తీసుకోనుంది.
మెట్రో నెట్‌వర్క్ స్వాధీనం - కీలక నిబంధన
మెట్రో మొదటి దశకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ,ప్పందాలు పూర్తయిన తర్వాతే రెండో దశ నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాతే రెండో దశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ అడ్డంకులు తొలగితేనే కేంద్రం నుండి నిధుల విడుదల, సాంకేతిక సహకారం సులభతరమవుతుందని ఆయన వివరించారు.
Wrote to Hon’ble CM Shri Revanth Reddy raising concern over delays in moving forward with Hyderabad Metro Phase-II, which the Government of Telangana has decided to take up. The Government of India has already agreed in principle to Phase-II, with the understanding that the… pic.twitter.com/1vXkNXs5TE
— G Kishan Reddy (@kishanreddybjp) January 16, 2026
వేగంగా నిర్ణయం తీసుకోవాలి!
పెరుగుతున్న నగర జనాభా , ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రో రెండో దశను వీలైనంత త్వరగా పూర్తి చేయడం అత్యవసరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విమానాశ్రయం , నగరంలోని ఇతర శివార్లకు మెట్రో కనెక్టివిటీ కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కేంద్రం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.





















