అన్వేషించండి

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి నేత్రాలంకరణ పూర్తి, ఈసారి ఎత్తు ఎంతంటే

Ganesh Chaturthi 2024: ఖైరతాబాద్ విగ్రహం నెలకొల్పి ఈ ఏడాదికి 70 ఏళ్లు నిండనున్నాయి. అందుకని 70 అడుగుల శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఈసారి ఏర్పాటు చేస్తున్నారు.

Khairatabad Ganesh News: హైదరాబాద్‌లో వినాయకచవితి రోజు కొలువుదీరనున్న ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం పనులు పూర్తి అయ్యాయి. అదే ప్రదేశంలో విగ్రహాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 7న వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి తొలి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. అందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. విగ్రహం పనులు ఎప్పుడో పూర్తి కాగా.. రంగులు అద్దడం కూడా కళాకారులు పూర్తి చేశారు. ఆఖరి ఘట్టంగా గణనాథుడి కళ్లను నేడు రూపొందించారు. విగ్రహంపైన నేత్రాలను శిల్పి రాజేందర్ తీర్చిదిద్దారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ దర్శనం జరగనున్న సంగతి తెలిసిందే.

ఈసారి 70 అడుగుల ఎత్తైన శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించనున్నారు. ఖైరతాబాద్ విగ్రహం నెలకొల్పి ఈ ఏడాదికి 70 ఏళ్లు నిండనున్నాయి. అందుకని 70 అడుగుల విగ్రహాన్ని ఈసారి ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేందర్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు ఈ 70 అడుగుల విగ్రహాన్ని పూర్తి చేశారు.  గురువారం ఉదయం 10 గంటలకు ప్రధాన శిల్పి స్వామివారికి నేత్రాలంకరణ చేశారు. ఇక మొత్తం విగ్రహ పనులు పూర్తి కావడంతో చుట్టూ నిర్మాణం  కోసం ఏర్పాటు చేసిన కర్రలను కూడా తొలగిస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ వెల్లడించారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి నేత్రాలంకరణ పూర్తి, ఈసారి ఎత్తు ఎంతంటే

రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పూజలకు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన వారు వినాయక నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు ఆశీర్వచనం అందించారు.

భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే ద్వారా ఆహ్వానం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ దానం నాగేందర్ ఆహ్వానించారు. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆయన కోరారు. ప్రజాభవన్ లో పూజారులు, ఉత్సవ మండలి సభ్యులతో కలిసి ఆయన డిప్యూటీ సీఎంను ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరు కావాలని డిప్యూటీ సీఎంను వారు కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
Atchannaidu: అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ సర్కార్ కాదంటూ వార్నింగ్
అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మంత్రి అచ్చెన్నాయుడు, ఇది వైసీపీ సర్కార్ కాదంటూ వార్నింగ్
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABPఎన్టీఆర్‌ని స్టార్‌నీ దేవుడ్నీ చేసిన లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డిసిద్దరామయ్య ఈవెంట్‌లో భద్రతా లోపం, సీఎం వైపు దూసుకొచ్చిన యువకుడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం
Atchannaidu: అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ సర్కార్ కాదంటూ వార్నింగ్
అధికారులకు ముచ్చెమటలు పట్టించిన మంత్రి అచ్చెన్నాయుడు, ఇది వైసీపీ సర్కార్ కాదంటూ వార్నింగ్
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు
Floods in AP Telangana: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధులు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధులు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
AP Flood Politics: విజయవాడ వరదలపై బురద రాజకీయాలు - కూటమి ప్రభుత్వానికి 3 ప్లస్సులు, వైసీపీకి 3 మైనస్సులు
విజయవాడ వరదలపై బురద రాజకీయాలు - కూటమి ప్రభుత్వానికి 3 ప్లస్సులు, వైసీపీకి 3 మైనస్సులు
Khairatabad Ganesh: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
Bigg Boss 8 Telugu Episode 15 Day 14 : ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా
ఇదేం ఎలిమినేషన్ రా బాబు! వెళ్లిపోతూ వారి రంగు బయటపెట్టిన శేఖర్ బాషా
Embed widget