(Source: ECI/ABP News/ABP Majha)
Cantonment Bypoll: కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఫిక్స్ చేసిన కేసీఆర్
Hyderabad News: రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడం వల్ల ఆ స్థానంలో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.
Cantonment BRS MLA Candidate: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె నివేదిత. 2023 ఫిబ్రవరిలో సాయన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాయన్న కుమార్తె లాస్య నందితకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో లాస్య నందిత విజయం సాధించారు. కానీ, ఎన్నికల ఫలితాలు విడుదలైన మూడు నెలల వ్యవధిలోనే లాస్య నందిత ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా గైని నివేదిత ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
— BRS Party (@BRSparty) April 10, 2024
పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు.
- File Photo pic.twitter.com/h9oidhbQ3L