News
News
X

Kandlakoya IT Park: ఒక్క ట్వీట్‌తో రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కు

Telangana Gateway IT Park In Kandlakoya: ఒక్క ట్వీట్ ద్వారా తెలంగాణలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు KITEA అధ్యక్షుడు వెంకట్ తెలిపారు

FOLLOW US: 

 Kandlakoya IT Park: తెలంగాణ ప్రభుత్వం బెంగళూరుకు దీటుగా హైదరాబాద్‌ను ఐటీ సిటీగా డెవలప్ చేయాలని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన ఐటీ పార్కును నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఫిబ్రవరి 17న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే ఎత్తైనది. 5 లక్షల చదరపు అడుగులలో 14 అంతస్తుల్లో నిర్మాణం, 40 మీటర్లు కార్యాలయ స్థలం నిర్ణయించారు.

ఒక్క ట్వీట్ ద్వారా తెలంగాణలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్‌ (IT Park In Medchal:) జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్‌ వే పేరిట 10 ఎకరాల్లో 100 కోట్ల రూపాయాలతో నిర్మించనున్నారు. ఈ పార్కును దాదాపు వంద కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించనుడగా.. దీని ద్వారా 15 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 20వేల మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ (KITEA) అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. అసోసియేషన్ ప్రెస్‌మీట్‌లో వెంకట్, సభ్యులు ప్రభుత్వ సహకారంపై స్పందించారు.

అసలు ఏంటా ట్వీట్.. 
లాస్య ఇన్ఫో‌టెక్ కంపెనీ 2018 ఏప్రిల్ 29న మంత్రి కేటీఆర్ కి  ట్వీట్ చేసింది. గత 15ఏళ్ల నుంచి గచ్చిబౌలిలో ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది టెకీలు స్వతహాగా కొంపల్లి పరిసరాల్లో స్టార్టప్స్ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కోరగా.. స్పందించిన మంత్రి కేటీఆర్ త్వరలో కొంపల్లి లో ఐటీ హబ్ రానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం మేడ్చల్ జిల్లా అధికారులు, కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి దుండిగల్, పేట్ బషీరాబాద్ లో భూమిని పరిశీలించారు. చివరగా కండ్లకోయ వద్ద తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించినట్లు ప్రకటించింది.

ఫేస్ 2లో భాగంగా దుండిగల్ లో 450 ఎకరాల్లో ఐటీ పార్క్
ప్రస్తుతం కండ్లకోయలో చేపట్టనున్న ఐటీ పార్కులో మొత్తం 120కి పైగా సంస్థలు ఉండగా 90 కంపెనీలకు నూతనంగా నిర్మించే ఐటీ టవర్స్ లో స్థలాలు కేటాయించారు. ఫిబ్రవరి 17న శంకుస్థాపనం సందర్భంగా ఆ కంపెనీల ప్రతినిధులకు కేటాయింపు పత్రాలను మంత్రి కేటీఆర్ అందించనున్నట్లు  కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ (KITEA) అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. ఫేస్ 2లో భాగంగా దుండిగల్‌లో 450 ఎకరాల్లో ఐటీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో దీన్ని చేపడుతున్నారు. విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలమని ప్రభుత్వం భావించినట్లు తెలిపారు. కండ్లకోయ జంక్షన్‌ వద్ద స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు వేగవంతం చేసింది. అందులోనూ మంత్రి కేటీఆర్ ఐటీని హైదరాబాద్‌లో విస్తరించాలని భావించడం ప్లస్ పాయింట్ అయింది. ఐటీ పార్కు బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్‌) అప్పగించింది. ఇందులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

Also Read: India Bans Chinese Apps: చైనాకు మరో షాక్, 54 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ! లిస్ట్ రెడీ

Also Read: Gateway IT Park: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ ప్రాజెక్ట్, సిటీకి మరోవైపు, ఏకంగా 50వేల ఉద్యోగాలు, శంకుస్థాపనకు డేట్ ఫిక్స్

Published at : 14 Feb 2022 01:36 PM (IST) Tags: KTR Telangana Gateway IT Park IT Park in Kandlakoya KITEA Gateway IT Park

సంబంధిత కథనాలు

Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు

Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

క్షమాపణలు చెబితే సరిపోదు రేవంత్- శాంతించని కోమటి రెడ్డి

క్షమాపణలు చెబితే సరిపోదు రేవంత్- శాంతించని కోమటి రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణలు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణలు

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్- త్వరలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

టాప్ స్టోరీస్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!