News
News
X

TS High Court: హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర.. రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్

సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో సతీశ్ చంద్ర శర్మతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు.

FOLLOW US: 
 
సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో సతీశ్ చంద్ర శర్మతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్ చంద్ర పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి భవన్ నియమించిన సంగతి తెలిసిందే.

సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో సతీశ్ చంద్ర శర్మతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!

News Reels

బంగారు పతకాల విజేత జస్టిస్‌ శర్మ 
జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ భోపాల్‌లో 1961 నవంబర్‌ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరు పొందిన ఆయన తండ్రి బీఎన్‌ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. జబల్‌ పూర్‌లో ఇంటర్‌, సాగర్‌లోని హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్‌ సాధించి, నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు గెలిచారు. 1984 సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి సీనియర్‌ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏండ్ల వయస్సులోనే ఆయన ఈ హోదా సాధించారు. 

2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. గత ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.

Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ

తెలంగాణ హైకోర్టుగా విడిపోయాక నాలుగో సీజే
2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ 4వ వ్యక్తి. తొలి సీజేగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, అనంతరం జస్టిస్‌ హిమాకోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ హిమా కోహ్లీ ఇటీవలే పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు.

Also Read: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Oct 2021 11:41 AM (IST) Tags: cm kcr Telangana High Court governor tamilisai soundararajan Justice Satish Chandra Sharma TS High Court News CJ

సంబంధిత కథనాలు

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Minister KTR : తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

Minister KTR :  తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Palla Rajeshwar Reddy : సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy :  సజ్జల వ్యాఖ్యల వెనక మోదీ కుట్ర- సమైక్య రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!