అన్వేషించండి

JP Nadda: గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి చేసేవి గారడీలు, తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్: జేపీ నడ్డా

Telangana News | తెలంగాణలో కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోతుందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda) అన్నారు.

హైదరాబాద్‌: గ్యారంటీల పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా గారడీలు చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా (JP Nadda) విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఇలా అన్ని వర్గాలను మభ్యపెడుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

ఆరు గ్యారంటీలు, అరవై గారడీలు
కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు, కానీ చేస్తోందని అరవై గారడీలు అని బీజేపీ మండిపడుతోంది. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో ‘కాంగ్రెస్‌ ఏడాది వైఫల్యాలు’ పేరుతో శనివారం నాడు నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగించారు. ఓవైపు తాము ఇవ్వని హామీలను కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుంటే... తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై  పోరాటానికి బీజేపీ సిద్ధమైందన్నారు.

'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' విధానం ద్వారా తెలంగాణలోని ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమం చేరేలా నిర్విరామంగా కృషి చేస్తామన్నారు. డిసెంబరు 1 నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు జనచైతన్య కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎండగట్టారు. దేశంలో 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, మొత్తం 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు నడుస్తున్నాయని జేపీ నడ్డా అన్నారు. ఎక్కడైనా ఒకసారి అధికారంలోకి వస్తే ప్రజాధరణ, తమపై విశ్వాసంతో పదేపదే మళ్లీ అధికారం చేపడుతున్నామని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం పలు రాష్ట్రాల్లో ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయింని.. భవిష్యత్తులో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతుందని జోస్యం చెప్పారు. 

తెలంగాణకు కేంద్రం భారీ నిధులు 
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.1.1 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. స్మార్ట్‌సిటీలతో రైల్వే లైన్లు, వందే భారత్ సర్వీసులు సైతం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రైల్వే లైన్లు, 3 వందే భారత్‌లు, భారత్‌ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్‌- ఇండోర్, హైదరాబాద్‌- విశాఖపట్నం జాతీయ రహదారులు, సూరత్‌- చెన్నై, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ వంటి ప్రాజెక్టులను తెలంగాణకు కేంద్రం ఇచ్చిందన్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్‌, వరంగల్‌లకు భారీగా నిధులతో పాటు మిత్ర స్కీమ్ కింద జౌళి పార్కు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. త్వరలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని,  తెలంగాణ కూడా అందులో భాగస్వామి కావాలని జేపీ నడ్డా ఆకాంక్షించారు.

Also Read: Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి 

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం కాంగ్రెస్ ఏడాది పాలనపై విమర్శలు గుప్పించారు. గ్యారంటీలు అని 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, భవిష్యత్తులో తామే అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలన నడుస్తోందని బండి సంజయ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, వారి మాటల్ని ప్రజలు నమ్మరని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget