By: ABP Desam | Updated at : 15 Feb 2022 06:20 PM (IST)
కేసీఆర్‌కు ఫోన్ చేసిన దేవెగౌడ
కేంద్ర బడ్జెట్ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. దీనికి బీజేపేతర పార్టీలు ఒక్కొక్కరుగా మద్దతు ప్రకటిస్తున్నారు. సోమవారం బెంగాల్ సీఎం మమత బెనర్జీ కాల్ చేసి భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ఇప్పుడు మాజీ ప్రధాని దేవగౌడ ఫోన్ చేశారు.
కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు పెరుగుతోంది. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ ఫోన్ చేశారు. సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సిఎం కెసిఆర్‌ను అభినందించారు.
Today former Prime minister HD Devegowda had called upon the CM K Chandrashekar Rao and spoke to him. Devegowda said, "Congratulations, you have taken up a big battle, we are with you, we will have to fight communal forces and save the country: CMO Telangana
(File photos) pic.twitter.com/OuTXAjlpeO— ANI (@ANI) February 15, 2022
" రావు సాబ్...మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్క్రతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మీమందరం మీకు అండగా ఉంటాం.. మీ యుద్దాన్ని కొనసాగించండి. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది." అన్నట్టు తెలంగాణ సీఎంవో ప్రకటన విడుదల చేసింది.
దేవగౌడతో ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్.. దీనిపై మరింత లోతుంగా చర్చించాలని వీలైతే బెంగళూరు వచ్చి సమావేశమవతానని చెప్పినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా రావచ్చని కేసీఆర్‌ను దేవగౌడ ఆహ్వానించినట్టు సమాచారం.
నిన్న మమతా బెనర్జీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా బీజేపీకి వ్యతిరేకంగా నేతలంతా స్వరం ఎత్తడం ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే తీవ్ర చర్చకు దారి తీసింది. నిధుల విషయంలో వివపక్ష చూపిస్తున్న కేంద్రం... పెత్తనం విషయం మాత్రం ముందంజలో ఉందంటూ నేతలంతా మండిపడుతున్నారు. మొన్న గవర్నర్ వ్యవస్థపై స్టాలిన్‌తో బెంగాల్ సీఎం మమత మాట్లాడారు.
కేసీఆర్ కూడా బీజేపీ బండారం ఒక్కొక్కటిగా బయటపెడతామంటూ గతంలోనే చెప్పారు. మొన్న సర్జికల్‌స్ట్రైక్, రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై గట్టిగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో అసలు సినిమా ఉందంటు గట్టిగానే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తర్వాత స్టెప్ ఏం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు
TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్ఎస్ కౌంటర్
KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం