News
News
X

Indian Racing League: రయ్.. రయ్.. ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ సిద్ధం

ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ సిద్ధమైంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో భాగంగా హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌.. మోటార్‌స్పోర్ట్స్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సమాయత్తమైంది.

FOLLOW US: 
 

Indian Racing League:  ఇండియన్ రేసింగ్ లీగ్ కు హైదరాబాద్ సిద్ధమైంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో భాగంగా హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌.. మోటార్‌స్పోర్ట్స్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు సమాయత్తమైంది.  హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ సందడి చేయనుంది. 

 ఆరు జట్లు.. 24 మంది డ్రైవర్లు పాల్గొనే రేసింగ్‌ లీగ్‌ నాలుగు రౌండ్ల పాటు సాగుతుంది. ఈనెల 19, 20 తేదీల్లో మొదటి రౌండ్‌.. డిసెంబరు 10, 11 తేదీల్లో నాలుగో రౌండ్‌ రేసులకు హైదరాబాద్‌ వేదికగా నిలవనుంది. ఈనెల 25-27, డిసెంబరు 2-4 వరకు వరుసగా రెండు, మూడో రౌండ్‌ రేసులకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఆరు జట్లలో నలుగురు చొప్పున డ్రైవర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఒక మహిళా డ్రైవర్‌ ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొట్టమొదటి ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో తాజా సర్క్యూట్‌ ట్రయల్‌ రన్‌లా పనిచేయనుంది.

ఇండియన్ రేసింగ్ లీగ్ అంటే..

మోటార్‌స్పోర్ట్స్‌లో ఫార్ములావన్‌ అత్యున్నత రేసు. చాలామంది డ్రైవర్లు నేరుగా ఫార్ములావన్‌ రేసులో పాల్గొనలేరు. అక్కడికి చేరుకునేందుకు ఎఫ్‌4తో మొదలుపెట్టి.. ఎఫ్‌3లో బరిలో దిగి.. ఎఫ్‌2 స్థాయికి చేరుకుంటారు. ఆ తర్వాతే ఫార్ములా వన్‌లో బరిలో దిగే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఫార్ములా రేసుల్లో పాల్గొనడం అందరికీ సాధ్యం కాదు. అందుకే భారత్‌లో ఉన్న ప్రతిభావంతుల కోసంఐఆర్ ఎల్ (ఇండియన్ రేసింగ్ లీగ్) ఏర్పాటు చేశారు.  అమెరికాలో ఇండికార్‌, జపాన్‌లో సూపర్‌ ఫార్ములా మాదిరిగా మనకంటూ ఇది సొంత రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌. ఆరు జట్లలో స్వదేశీ, విదేశీ డ్రైవర్లు ఉంటారు. ప్రస్తుత సీజన్‌లో 24లో 12 మంది అంతర్జాతీయ రేసింగ్‌ డ్రైవర్లు కాగా.. అందులో ఆరుగురు మహిళలు ఉన్నారు.

News Reels

రేస్ సాగే తీరిది

ప్రతి రౌండ్లో రెండు స్ప్రింట్‌, ఒక ఫ్యూచర్‌ రేసు ఉంటాయి. శనివారం జరిగే మొదటి స్ప్రింట్‌ రేసు ఆదివారం నాటి స్ప్రింట్‌కు పోల్‌ పొజిషన్‌ నిర్ణయిస్తుంది. స్ప్రింట్‌ రేసులో ఒక్కో జట్టు నుంచి రెండు కార్లు పోటీలో నిలుస్తాయి. మొత్తం 12 కార్లు ట్రాక్‌పై పరుగులు తీస్తాయి. ప్రతి కారులో ఒక్క డ్రైవర్‌ ఉంటారు. 20 నిమిషాల్లో రేసు ముగుస్తుంది. ఈ నిర్ణీత సమయంలో పూర్తిచేసిన ల్యాప్‌ల సంఖ్య ఆధారంగా ఆయా జట్లకు పాయింట్లు కేటాయిస్తారు. 

ఆదివారం  ఫ్యూచర్‌ రేసు జరుగుతుంది. ఒక్కో కారులో ఇద్దరు డ్రైవర్లు చొప్పున 12 కార్లు రేసులో బరిలో ఉంటాయి. మధ్యలో డ్రైవర్‌ మారేందుకు అవకాశం ఉంటుంది. ఈ రేసు నిడివి 40 నిమిషాలు. హైదరాబాద్‌, చెన్నైలలో నాలుగు రౌండ్ల అనంతరం అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. చెన్నైలో 3.7 కిమీ ట్రాక్‌ (ఒక ల్యాప్‌) ఉండగా.. హైదరాబాద్‌లో 2.7 కిమీ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ చుట్టూ అన్ని హంగులతో ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ రేసుల్ని స్టార్‌ స్పోర్ట్స్‌ 2 ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రత్యక్షంగా చూడాలనుకుంటే బుక్‌మైషో.కామ్‌లో టిక్కెట్లు కొనుక్కోవచ్చు.

పర్యవేక్షణ ఎవరు

రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌పీపీఎల్‌) ఆధ్వర్యంలో ఐఆర్‌ఎల్‌ జరుగనుంది. ఇటలీకి చెందిన కార్ల తయారీ సంస్థ వోల్ఫ్‌ రేసింగ్‌ బృందం ఐఆర్‌ఎల్‌ కార్లు, సాంకేతికను పర్యవేక్షించనుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిమీ వేగంతో ప్రయాణించనుంది. 220 బీహెచ్‌పీ, 1.1 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యం ఉంటుంది. కారు బరువు 380 కిలోలు. ఫార్ములావన్‌ కారు గరిష్టంగా గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్తుంది.

జట్లు..

  • హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌: నీల్‌ జని, అఖిల్‌ రవీంద్ర, అనిందిత్‌రెడ్డి, లోలా లవిన్స్‌ఫోస్‌
  •  గోవా ఏసెస్‌: రౌల్‌ హేమన్‌, సోహిల్‌ షా, ఆమిర్‌ సయ్యద్‌, గాబ్రియెలా జిల్కోవా
  •  చెన్నై టర్బో రైడర్స్‌: జాన్‌ లాంకాస్టర్‌, పార్థ్‌ గోర్పాడె, విష్ణు ప్రసాద్‌, నికోల్‌ హావ్‌ర్డా 
  • గాడ్‌స్పీడ్‌ కొచి: జోర్డాన్‌ ఆల్బర్ట్‌, నిఖిల్‌ బోరా, రుహాన్‌ ఆల్వా, ఆరెలియా నోబెల్స్‌ 
  • బెంగళూరు స్పీడ్‌స్టర్స్‌: ఒలివర్‌ వెబ్‌, అన్షుల్‌ గాంధీ, రిషోన్‌ రాజీవ్‌, బియాంకా బుస్తమాంటె
  • స్పీడ్‌ డెమాన్స్‌ దిల్లీ: మిచ్‌ గిల్బర్ట్‌, ఆకాశ్‌ గౌడ, షాహాన్‌ అలీ మోసిన్‌, సెలియా మార్టిన్‌

రేసులో హైదరాబాద్ కుర్రాడు 

దేశంలో జరుగుతున్న మొట్టమొదటి ఐఆర్‌ఎల్‌లో తెలుగబ్బాయి కొండా అనిందిత్‌రెడ్డి కూడా ఉన్నాడు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ సంయుక్త ఎండీ సంగీతారెడ్డిల తనయుడు అతను. హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ జట్టు తరఫున బరిలో ఉన్నాడు. రేసింగ్‌లో ఏడేళ్ల అనుభవమున్న అనిందిత్‌.. ట్రాక్‌పై తనదైన ముద్ర వేశాడు. 2016 యూరో జేకే 16 ఛాంపియన్‌షిప్‌, 2017 యూరో జేకే ఛాంపియన్‌షిప్‌లో అనిందిత్‌ విజేతగా నిలిచాడు. ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఎస్‌సీఐ) 2017 మోటార్‌స్పోర్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు.

 

Published at : 17 Nov 2022 08:58 AM (IST) Tags: Indina Racing league Indina Racing league in Hyderabad IRL in Hyderabad Indian Racing League latest news Hyderabad Indian Racing League

సంబంధిత కథనాలు

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Sharmila Padayatra: రేపటి నుంచి షర్మిల పాదయాత్ర, అనుమతిపై ఇంకా తేల్చని వరంగల్ పోలీసులు

Sharmila Padayatra: రేపటి నుంచి షర్మిల పాదయాత్ర, అనుమతిపై ఇంకా తేల్చని వరంగల్ పోలీసులు

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి- సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి- సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Breaking News Live Telugu Updates: దిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ  

Professor Raviranjan Suspended: హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్, విద్యార్థులకు తెలిపిన రిజిస్ట్రార్!

Professor Raviranjan Suspended: హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్, విద్యార్థులకు తెలిపిన రిజిస్ట్రార్!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి