By: ABP Desam | Updated at : 18 Jan 2023 08:17 PM (IST)
ఐఐటీ హైదరాబాద్ ఈ సమ్మిట్
ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ 5వ ఎడిషన్ ఈ సమ్మిట్ తేదీలను ఖరారు చేసింది. జనవరి 21, 22 తేదీలలో వార్షిక మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నామని ఐఐటీ హైదరాబాద్ తెలిపింది.
ఈ సమ్మిట్ అంటే ఏమిటి :
కరోనా వ్యాప్తి తర్వాత, ఈ-సమ్మిట్ 2023ని ఆఫ్‌లైన్‌లో నిర్వహించనుండటం ఐఐటీ హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్‌కు ఇది ఒక అద్భుత అవకాశం. భారతదేశంలో నిర్వహించే అతిపెద్ద వ్యాపార, స్టార్టప్ సమావేశాలలో ఈ సమ్మిట్ ఒకటి. ఈ కార్యక్రమంలో ద్వారా నూతన వ్యాపార వ్యవస్థాపకులు, కార్పొరేట్ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఆసక్తి గల విద్యార్థులను ఒకచోట చేర్చేందుకు దోహదం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, అనుభవం ఉన్న నిపుణులు, విద్యార్థులు ఆలోచనల్ని పంచుకునే కేంద్రంగా ఈ సమ్మిట్ నిలవనుంది. ఇది కొత్త ఆవిష్కరణలు, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది.
ఈ ఏడాది థీమ్ ఇదీ..
ఓవైపు మాంద్యం పెరిగిపోవడం, నిధుల కొరత లాంటి కారణాలతో గత ఏడాది స్టార్టప్‌లకు కష్టకాలం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది స్టార్టప్‌లకు, వ్యాపారాలకు పెట్టుబడులు తగ్గాయి. 2021లో పుంజుకున్న తర్వాత, దేశవాలీ స్టార్టప్ లకు మార్కెట్ మళ్లీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. An Arduous Carrefour థీమ్‌తో కంపెనీల వ్యవస్థాపకులు, నూతన స్టార్టప్స్ కు సంబంధించి ఎదుర్కొన్న సవాళ్లు, కొత్త అవకాశాలను అన్వేషించడం, బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఎంత కృషి చేయాలన్నది ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.
ప్యానెల్స్‌గా కీలక విషయాలపై చర్చలు..
అంతర్జాతీయంగా నెలకొన్న సమస్యలను విశ్లేషించడానికి, ఆ పరిస్థితులను అదిగమించేందుకు వ్యాపార నిపుణులను ఒక వేదిక మీదకు రానున్నారు. కీలక చర్చలు దేశంలోని ప్రముఖ వ్యాపార నిపుణులు ఈ సమ్మిట్‌లలో పాల్గొని తమ అనుభవాలు షేర్ చేసుకుంటారు. ఇలాంటి గొప్ప వ్యాపారవేత్తలు ఒకచోట చేరి తమ వేదికగా వారి అనుభవాలను పంచుకోవడం నిజంగా గర్వకారణం అని ఐఐటీ హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ పేర్కొంది.
ఈ సంవత్సరం ఇందులో పాల్గొనే ప్రముఖ వ్యక్తలు వీరే
డాక్టర్. శాంత థౌటం – తెలంగాణ ప్రభుత్వానికి చెందిన చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్
రామ అయ్యర్ - జీఎంఆర్ గ్రూప్‌లో ఇన్నోవేషన్ విభాగం అధిపతి
GV కృష్ణగోపాల్ - యాక్సెస్ లైవ్లీహుడ్స్ గ్రూప్ సంస్థల సీఈఓ
శ్రీ చరణ్ లక్కరాజు - stuMagz వ్యవస్థాపకుడు, సీఈఓ
అవిషేక్ గుప్తా – కాస్పియన్ డెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ
డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి - సాయి గంగా పనాకియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ
ఉదయ కుమార్ దింట్యాల - AT&T గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
సందీప్ పొడ్డార్ - నావికర్ణ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్
ఈ సంవత్సరం ప్యానెల్ చర్చలు, ఫేమస్ ప్యానెలిస్ట్‌లు చర్చించే అంశాలివే:
1. భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపుల మార్పులు:
హుస్సేని ఎస్ఎఫ్ - JP మోర్గాన్ & చేజ్‌లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఎన్ శ్రీనివాసన్ - HDFC బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
నీరజ్ బన్సల్ – CredRight ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ
ధృవ్ గుప్తా (మోడరేటర్) - iTICలో సీఓఓ
2. సాంకేతిక ఆవిష్కరణలు - నిర్వహించే అంశాలు, వాటి ప్రభావాలు
సౌమ్య రంజన్ ప్రధాన్ - క్యాప్జెమినీలో అప్లైడ్ ఇన్నోవేషన్ ఎక్స్‌ఛేంజ్ హెడ్
రఘు మంగరాజు – BLEND360 ఇండియా విభాగం వైస్ ప్రెసిడెంట్
రాజేష్ షెనాయ్ – సెటాస్ హెల్త్‌కేర్ రీసెర్చ్‌లో సీనియర్ డైరెక్టర్
డాక్టర్ నకుల్ పరమేశ్వర్ (మోడరేటర్) – అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ IIT హైదరాబాద్
3. ది ఎంప్లాయర్ - ఎంప్లాయీ పారడాక్స్: లేఆఫ్స్, జాబ్స్ హైరింగ్
యుగంధర్ పెనుబోలు - Winzard.io, HR టెక్ వ్యవస్థాపకుడు
డాక్టర్ మురళీ పద్మనాభన్ - లీడర్‌షిప్ డైమెన్షన్స్ LLP మేనేజింగ్ డైరెక్టర్
నంద కిషోర్ - వీఎల్ఎస్. సిస్టమ్స్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్
డాక్టర్. ఎంపీ గణేష్ (మోడరేటర్) – హెడ్ & అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ IIT హైదరాబాద్
గతంలో జరిగిన ఈ-సమ్మిట్ 50కి పైగా స్టార్టప్‌లు, 30 కి పైగా ప్రముఖ వ్యక్తల భాగస్వామ్యంతో 80,000 ఔట్ రీచ్‌తో సక్సెస్ అయింది. ఈ ఏడాది ఐదవ ఎడిషన్ ఈ సమ్మిట్ మరింత విజయం సాధించాలని ఐఐటీ హైదరాబాద్ ఆశిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది.
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
Global EduFest 2023: ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023' నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
పెళ్లి తర్వాత జంటగా కనిపించిన కియారా-సిద్దార్థ్, ఫోటోలు వైరల్