అన్వేషించండి
Advertisement
Hyderabad: 'నా కారుకే చలానా రాస్తారా' అంటూ ట్రాఫిక్ పోలీసులపై మహిళ ఫైర్
Hyderabad: కోఠిలోని సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. ట్రాఫిక్ పోలీస్ వద్ద వాకీ టాకీ లాక్కుని వాగ్వాదానికి దిగింది. వారితో దురుసుగా ప్రవర్తించింది.
Hyderabad: హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హల్ చల్ చేసింది. కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో "నో" పార్కింగ్ స్థలంలో దివ్య అనే మహిళ కారు పార్క్ చేసింది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఆమెను ప్రశ్నించారు. నో పార్కింగ్ స్థలంలో కారు నిలపకూడదని.. కారు చక్రానికి లాక్ వేసి చలానా వేశారు. దీన్ని గమనించిన మహిళ తన కారుకు చలానా ఎలా విధిస్తారంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. వారి దగ్గర ఉన్న వాకీటాకీని లాక్కుని పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion