Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పనుల వల్ల మూడు నెలల పాటు ట్రాఫిక్ ను మళ్లించారు.
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. మెట్రో స్టేషన్ వద్ద ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 28వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్ అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహకరించాలని ప్రయాణికులను కోరారు.
కూకట్ పల్లి నుంచి బేగంపేట వైపు ట్రాఫిక్ మళ్లింపు
కూకట్ పల్లి నుంచి అమీర్ పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్ పల్లి మెట్రో స్టేషన్ యూటర్న్ వద్ద లెఫ్ట్ టర్న్ ఔడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాప్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పార్వత్ నగర్, టోడీ కాంపౌండ్ వైపు మళ్లించనున్నారు. ఇక కూకట్ పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్ ను కూకట్ పల్లి వై జంక్షన్, బాలా నగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్ పల్లి జంక్షన్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లైఓవర్ వద్ద మళ్లించనున్నారు. బాలానగర్ నుంచి కూటక్ పల్లి వై జంక్షన్ మీదగా అమీర్ పేట వైపు వెళ్లే వాహనాలను బాలా నగర్ ఫ్లైఓవర్ కింద న్యూ బోయిన్ పల్లి జంక్షన్, తాడ్ బండ్ రైట్ టర్న్, ప్యారడైస్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ వైపు మళ్లించనున్నారు. అలాగే మూసాపేట, గూడ్ షెడ్ రోడ్డు నుంచి అమీర్ పేట వైపు వచ్చే ట్రాఫిక్ ను ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, పార్వత్ నగర్, టోడీ కాపౌండ్, కావూరి హిల్స్ వైపు మళ్లిస్తారు. హైదారాబాద్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రయాణం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదారాబాద్ లోని అంబర్ పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు 40 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు రోడ్డు మూసి వేశారు. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లించారు. ముందుగానే ఈ విషయాన్ని ప్రకటించి మరీ వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు చెప్పారు. ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్ రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లై ఓవర్, విద్యా నగర్, ఫీవర్ దవాఖాన, బర్కత్ పురా, నింబోలి అడ్డా వైపు నకు వాహనాలను మళ్లించనున్నారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్ పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్ రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్ కు వెళ్లేలా చేశారు. ఛే నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతించారు.