Hyderabad Traffic: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ దారుల్లోకి ఇవాళ నో ఎంట్రీ!
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కారణంగా నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad Traffic Restrictions: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కారణంగా నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా నెక్లెస్ రోటరీ, ఐమాక్స్ థియేటర్ పరిసరాల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) April 13, 2023
In view of unveiling of 𝐃𝐫. 𝐁.𝐑. 𝐀𝐦𝐛𝐞𝐝𝐤𝐚𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐞 by the Hon’ble Chief Minister of Telangana state and public meeting on 14.04.2023 from 01 pm to 08 pm.
Commuters are requested to note and plan accordingly.#TrafficAdvisory: https://t.co/8vJUSxk8dc pic.twitter.com/9EASwJBWSN
#HYDTPinfo Citizens are appealed to make note of Traffic restrictions https://t.co/BtQ88EJ8XI in place and requested to take alternative routes.
— Raju K P V (@InsAdmnHYDTP) April 14, 2023
Kindly avoid journey in 3 km vicinity of Hussain Sagar Lake https://t.co/yUW9u4hVf9 @HYDTP pic.twitter.com/MsfASbC83h
ఏయే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అంటే..?
- పీవీ విగ్రహం - నెక్లెస్ రోటరీ, ఎన్టీఆఱ్, తెలుగుతల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్ ను అనుమతించరు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ వివి విగ్రహం నుంచి షాదాన్, నిరంకారి వైపు వెళ్లాలి
- అలాగే ట్యాంక్ బండ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గం వైపు ట్రాఫిక్ అనుమతించరు. సోనాబి మసీదు వద్ద రాణిగంజ్ కర్బాలా వైపు మళ్లిస్తారు.
- రసూల్ పుర/మినిస్టర్ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే అనుమతి లేదు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు వెళ్లాలి.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే అవకాశం ఉండదు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
- ట్యాంక్ బండ్, తెలుగుతల్లి నుంచి, అలాగే బీఆర్కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు పంపిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు నో ఎంట్రీ.
- ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వైపు కాకుండా రాజ్ దూత్ లేన్ వైపు వెళ్లాలి.
- ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్ మూసి ఉంటాయి.
పూర్తిగా మూసి ఉంచబోతున్న రోడ్లు..!
నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్కు, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను శుక్రవారం మూసి వేస్తున్నట్లు వెల్లడించింది.