అన్వేషించండి

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలు ఆ రూట్లలో వెళ్తున్నారా, కాస్త ఆగండి - నేడు భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ లో జరగుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కారణంగా భాగ్య నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై వచ్చే వాహనాలను మళ్లిస్తున్నారు. 

Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ వేధికగా ఈరోజు ఐపీఎల్ జరుగుతోంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈరోజు సాయంత్రం సన్ రైజర్స్ -హంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ప్రధానంగా వరంగల్ రహదారిపై వచ్చే వాహనాలను చెంగిచర్ల చౌరస్తా నుంచి చర్లపల్లి ఎన్ఎఫ్సీ వైపు మళ్లిస్తున్నారు. అలాగే ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలను నాచారం ఐడీఏ మీదుగా చర్లపల్లి వైపు మళ్లించనున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాత స్టేడియంలో అనుమతి

ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు తమ వెంట ఎలాంటి వస్తువులు తీసుకు రావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్టేడియంలోకి అనుమతించనున్నారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సౌకర్యం కల్గకుండా బందోబస్తు అందిస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ చౌహాన్ వివరించారు. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని తెలిపాడు. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు స్టేడియం పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. అదే విధఁగా బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. టికెట్ల పంపిీ పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది అలాగే మెట్రో సర్వీసులను కూడా పొడగించారు. 

ఏప్రిల్ 2 నుంచి మే 18 వరకు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చర్యలు

నేటి నుండి  మే 18 వరకు మొత్తం 215 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పార్కింగ్ స్థలాలు, సాధారణ ట్రాఫిక్ కోసం ప్రధాన మార్గాలు, స్టేడియంకు వెళ్లే మార్గాలతోపాటు స్డేడియం చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసే 8 సెక్టార్లలో పోలీసులు మోహరించారు. మ్యాచ్ కు వచ్చే క్రికెట్ అభిమానులు ఏక్ మినార్ మస్జిద్ రోడ్, స్టేడియం రోడ్ , హిందూ ఆఫీస్ రోడ్ నుండి స్టేడియంకు యాక్సెస్ రోడ్లలోకి చేరుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, వేదిక మార్గాల్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా వాహన దారులకు కోసం 324 అనేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లోకి ఎవరు ముందుగా వస్తే వారి వాహనాలు అదే క్రమ పద్దతిలో పార్క్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసారు.పార్కింగ్‌ను పార్కింగ్ రద్దీ  నివారించడానికి, వేదికకు త్వరగా యాక్సెస్ చేయడానికి మెట్రో రైలు సేవలను కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ,అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సమాచారం అందించేందు ఎఫ్ ఎమ్ సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget