Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ వాసులు జర జాగ్రత్త - రేపు ఈ దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ వాసులూ జర జాగ్రత్త. జూన్ 29వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు.
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో జూన్ 29వ తేదీ గురువారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని పుల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనుండగా.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు దారులను మళ్లించారు. మీరాలం ట్యాంక్ ఈద్గా ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని చెప్పారు. దీంతో ప్రయాణికులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..!
పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్ పురా ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 గంల నుంచి 11.30 గంటల మధ్య అనుమతిస్తారు. ఈ వాహనాలను జూ పార్కు, మసీదు అల్హా హో అక్బర్ ఎదురుగా పార్కు చేయాలి. సాధారణ ట్రాఫిక్ కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ బహదూర్ పురా ఎక్స్ రోడ్డు వద్ద కిషన్ బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు. శివరాంపల్లి, ధనమ్మ హట్స్ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్ రోడ్డు నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్ ను ఈద్గా వైపు అనుమతించరు. ఈ వాహనాలు ధనమ్మ హట్స్ క్రాస్ రోడ్సు నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట రూట్లలో వెళ్లాలి. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే వాటిని పురానాపూల్ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్ పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్ పురా వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. కాలాపత్తర్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్ ఠాణా వైపు నుంచి అనుమతిస్తారు. సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్ పురా వైపు మళ్లిస్తారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) June 21, 2023
Commuters, please make a note of #TrafficAdvisory in view of #GolcondaBonalu #Celebrations 2023 at #GolcondaFort from 08 AM to 11 AM on mentioned dates i.e., 22nd, 25th, 29th of June-23 and 2nd, 6th, 9th, 13th, 16th & 20th of July-23.#Bonalu #Festival #Bonalu2023 pic.twitter.com/DJDJTgTVql
అలాగే జులై 2, 6, 9, 13, 16, 20వ తేదీల్లో కూడా గోల్కొండ బోనాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాందేవ్ గూడ నుంచి గోల్కొండ కోట వయా మక్కి దర్వాజా, లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వయా ఫతే దర్వాజా, సెవెన్ టంబ్స్, గోల్కొండ నుంచి గోల్కొండ కోట వయా బంజారా దర్వాజా దారుల్లో ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.