Hyderabad Traffic Diversion: నగర వాసులకు అలర్ట్, హైదరాబాద్‌లో నేడు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు- పార్కింగ్ పూర్తి వివరాలు
Praja Palana Praja Vijayotsavalu | హైదరాబాద్‌లో నేడు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ షో కారణంగా వాహనాలు దారి మళ్లిస్తున్నారు.

Traffic Diversions in Hyderabad due to IAF Air Show | హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నేడు హైదరాబాద్‌లో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించనుంది. దాంతో నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ఈ వివరాలు తెలుసుకుని బయటకు వెళ్లాలని, లేకపోతే ఇబ్బంది పడతారని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ట్యాంక్‌బండ్ (Tankbund), హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) పరిసరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ రోటరీ, పాత సైఫాబాద్ పోలీసుస్టేషన్, కవాడిగూడ క్రాస్‌రోడ్, డీబీఆర్ మిల్స్, కడాలబావి జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు చేయాలని వాహనదారులకు సూచించారు.
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద వద్ద హుస్సేన్ సాగర్ మీదుగా భారత వైమానిక దళం ఎయిర్ షో నిర్వహించనుంది. అందుకోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు.
1. వీవీ విగ్రహం వద్ద: రాజ్‌భవన్, పంజాగుట్ట నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు అనుమతించరు. వీవీ విగ్రహం వద్ద షాదన్, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్ వైపు వాహనాలు మళ్లిస్తారు.
2. నెక్లెస్ రోటరీ వద్ద: ఖైర్లాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వస్తున్న ట్రాఫిక్ ను అనుమతించరు. ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద PVNR మార్గ్/నెక్లెస్ రోడ్ - ప్రసాద్ IMAX/మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లింపులు.
3. పాత తెలుగు తల్లి జంక్షన్ వద్ద: లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతిలేదు. పాత తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లింపులు.
4. తెలుగు తల్లి ప్రారంభ ఫ్లైఓవర్ వద్ద: ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే ట్రాఫిక్ పాత అంబేద్కర్ జంక్షన్ వైపు అనుమతి లేదు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్ట మైసమ్మ వైపు వాహనాలు మళ్లిస్తారు.
5. పాత PS సల్ఫాబాద్ వద్ద: నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ మినార్ వైపు వచ్చే వాహనాలు అనుమతించరు. రవీంద్రభారతి వైపు మళ్లింపులు
6. రవీంద్ర భారతి వద్ద: ఓల్డ్ PS సైఫాబాద్ నుంచి ఇక్బాల్ వైపు వస్తున్న ట్రాఫిక్ ను రవీంద్ర భారతి, HTP వైపు మళ్లించనున్నారు. HTP నుంచి ఇక్బాల్ మినార్ వైపు వచ్చే వాహనాలను లక్డికాపూల్ వైపు మళ్లించనున్నారు.
7. A1 డీబీఆర్ మిల్స్: ధోబీ ఘాట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్/అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. DBR మిల్స్ వద్ద కవాడిగూడ క్రాడ్ రోడ్ వైపు మళ్లింపు.
8. కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద: డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద జబ్బార్ కాంప్లెక్స్ & CGO టవర్స్ వైపు మళ్లింపులు. CGO టవర్స్ నుంచి సెయిలింగ్ క్లబ్ వైపు వచ్చే ట్రాఫిక్ కవాడిగూడ "X" రోడ్ల వద్ద DBR మిలిస్ & జబ్బార్ కాంప్లెక్స్ వైపు మళ్లింపు.
9. కర్బలా మాల్దాన్ వద్ద: రాణిగంజ్ నుంచి ఎగువ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు వాహనాలు మళ్లిస్తారు.
RTC బస్సుల మళ్లింపు:
1. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా MGBS వైపు వచ్చే అన్ని జిల్లాల ఆర్టీసీ బస్సులు స్వీకర్ ఉపాకర్ జంక్షన్ వద్ద YWCA, సంగీత్- మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్, బర్కత్‌పురా, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డా, రంగమహల్‌ఘాట్, రంగమహల్‌ఘాట్, రంగామహల్‌ఘాట్, ఎంజీబీఎస్ వైపు మళ్లించనున్నారు.
2. ట్యాంక్ బండ్ వైపు వచ్చే సిటీ బస్సులను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ స్థలాలు:
1. PVNR మార్గ్/ నెక్లెస్ రోడ్, (జనరల్ పబ్లిక్ కోసం 250 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు),
2. ఆదర్శ్ నగర్ లేన్ (జనరల్ పబ్లిక్ కోసం 200 ద్విచక్ర వాహనాలు)
3. GHMC హెడ్ ఆఫీస్ లేన్, (జనరల్ పబ్లిక్ కోసం 50 కార్లు)
4 ఫార్ములా రేస్ కోర్స్ రోడ్ - (జనరల్ పబ్లిక్ కోసం 100 కార్లు & 500 టూ వీలర్స్)
5. బోట్స్ క్లబ్ 150 మంత్రుల కోసం కార్లు)
6. అమరవీరుల స్మారక చిహ్నం- (ఎమ్మెల్యేలు, MLCలు & ఎంపీలు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు (IAS), కార్పొరేషన్ చైర్మన్లు, ZP చైర్మన్లు ఇతర ప్రముఖులకు 300 కార్లు).
ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ కింది జంక్షన్‌లు కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణాలు చేయాలని సూచించారు.
రద్దీ ఉండే జంక్షన్లు (1) వీవీ విగ్రహం, ఖైరతాబాద్ (2) పాత PS సైఫాబాద్ (3) ఇక్బాల్ మినార్ (4) తెలుగు తల్లి జంక్షన్ (5) నెక్లెస్ రోటరీ (6) లిబర్టీ (7) రవీంద్ర భారతి (8) అంబేద్కర్ విగ్రహం (9) కవాడిగూడ కూడలి (10) కట్టమైసమ్మ (11) ఇందిరా పార్క్ జంక్షన్ (12) కర్బలా మైదాన్ (13) రాణిగంజ్ (14) నల్లగుట్ట.






















