అన్వేషించండి

Saddula Bathukamma: రేపు సద్దుల బతుకమ్మ-ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు.

బతుకమ్మ సంబరాలు... తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలై 9 రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగలో ఒక్కో రోజు ఒక్కో  ప్రత్యేకత. చివరిరోజు సద్దుల బతుకమ్మ చేసుకుంటారు. ఆ రోజు సందడి అంతా కాదు. మహిళలు 9రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున  బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను తీసుకుని... మంగళసూత్రానికి పెట్టుకుంటారు. పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు  చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడతారు. బతుకమ్మ ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు.

ఈ పూలపండుగ బతుకమ్మ... ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. సద్దుల బతుకమ్మను.. ఆశ్వయుజ అష్టమి నాడు జరుపుకుంటారు. ఆదేరోజు దుర్గాష్టమి. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నంతో ప్రసాదాలు సమర్పించారు. సద్దుల బతుకమ్మ మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ పూలతో బతుకమ్మను తయారు చేసి పూజిస్తారు. సాయంత్రం బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నిమజ్జన వేడుక కన్నులపండువగా జరుగుతుంది. 

రేపు సద్దుల బతుకమ్మను కన్నులపండువగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. లుంబిని పార్క్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై రేపు (ఆదివాం) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆంక్షలు అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ మళ్లింపులు కూడా ఉంటాయని చెప్పారు. తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా అనుమతించరు. అలాగే.. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ దగ్గర బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్ వైపు మళ్లిస్తారు. ఇక.. ఎక్బాల్‌మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తామని చెప్పారు. 

అలాగే... నల్లగుట్ట నుంచి బుద్దభవన్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు దగ్గర రాణిగంజ్‌, నెక్లెస్‌రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు.  హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూటర్న్‌ తీసుకొని తెలుగు తల్లి  జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక... సికింద్రాబాద్‌ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించ‌రు. ఆ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌  వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగుతల్లి ఫ్లైఓవ‌ర్‌ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వైపు పంపుతున్నారు.   జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ నుంచి వెళ్లనున్నాయి. సిటీ బస్సులు కూడా కర్బాలా మైదాన్‌ దగ్గర మళ్లిస్తారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే  వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget