Trains Cancellation Schedule: నేటి నుంచి ఈ రైళ్లు క్యాన్సిల్, 34 ఎంఎంటీఎస్, 15 ఇతర ట్రైన్స్ - లిస్ట్ ఇదీ
ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లుగా ఓ ప్రకటనలో SCR పేర్కొంది. అంతేకాక, మరో 15 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసినట్లుగా ప్రకటించింది.
![Trains Cancellation Schedule: నేటి నుంచి ఈ రైళ్లు క్యాన్సిల్, 34 ఎంఎంటీఎస్, 15 ఇతర ట్రైన్స్ - లిస్ట్ ఇదీ Hyderabad: South Central Railway cancels mmts, passenger trains due to heavy rains Trains Cancellation Schedule: నేటి నుంచి ఈ రైళ్లు క్యాన్సిల్, 34 ఎంఎంటీఎస్, 15 ఇతర ట్రైన్స్ - లిస్ట్ ఇదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/ac5d39471873324a22727905e9b8e7bf1657766911_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
South Central Railway: హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో రోజూ ప్రయాణించేవారికి చేదు వార్త! వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం అయింది. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర రైళ్లను కాన్సిల్ చేస్తూ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొంది. అంతేకాక, మరో 15 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసినట్లుగా ప్రకటించింది.
లింగం పల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి, ఫలక్ నుమా - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్ నుమా, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య తిరిగే రైలు సర్వీస్‌లను రద్దు చేసింది.
Also Read: Kukatpally Theft: హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!
Trains Cancellation Schedule: లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 9, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 9, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 7, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 7, సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో 1, లింగపల్లి – సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Cancellation of MMTS train @drmsecunderabad @drmhyb pic.twitter.com/3Lx35uWorK
— South Central Railway (@SCRailwayIndia) July 13, 2022
సికింద్రాబాద్, ఉందానగర్, మేడ్చల్, బొల్లారం స్టేషన్ల మధ్య నడిచే రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ స్పెషల్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము స్పెషల్ రైలు, హుజూర్ సాహెబ్ నాందేడ్ – మేడ్చల్ – హుజూర్ సాహెబ్ నాందేడ్ ప్యాసింజర్ రైలు రద్దు అయింది. సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు సర్వీస్, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైలను కూడా రద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు - విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)