By: ABP Desam | Updated at : 03 Mar 2022 12:43 PM (IST)
మృతులు కే.రాఘవేందర్ రెడ్డి, ఎన్. శ్రీనివాస్ రెడ్డి (ఫైల్ ఫోటోలు)
Hyderabad Realtors Murder: హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం సమీపంలో రెండు రోజుల క్రితం ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తుపాకీ కాల్పులు (Ibrahimpatnam Realtors Murder) జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస రెడ్డి, రాఘవేందర్ రెడ్డి చనిపోయారు. సంచలనం సృష్టించిన ఈ ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును తాజాగా రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఛేదించారు. ఘటన జరిగిన రెండు రోజుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మట్టా రెడ్డి గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మట్టా రెడ్డి వీరిని చంపించేందుకు సుపారీ గ్యాంగ్‌ను పురమాయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటికి వచ్చింది. దీంతో మట్టారెడ్డి, నవీన్ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిని నేడు (మార్చి 3) సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు భాగస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు (Gun Fire in Hyderabad) జరిపారు. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి 10 ఎకరాల భూమి కొన్నాడు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టా రెడ్డి దాన్ని కబ్జా చేశాడు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్, మరో వ్యక్తితో కలిసి సైట్ దగ్గరికి వెళ్లగా, అక్కడే ఉన్న మట్టా రెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మట్టారెడ్డి ఇతరులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోగా.. రాఘవేందర్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు.
హత్య అనంతరం మృతుల రెండు కుటుంబాల వారు కూడా మట్టా రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు విచారణ మరింత సులువు అయింది. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపి.. మట్టా రెడ్డి సుపారీ గ్యాంగ్‌తోనే ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాంకేతిక ఆధారాలపైన కూడా దృష్టి పెట్టి, పోలీసులు మృతుల కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేశారు. కొన్ని నెలలుగా వీరిద్దరూ సెటిల్మెంట్ చేసిన భూముల వివరాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు.
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!