అన్వేషించండి

Hyderabad Rains: హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌- అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న అధికారులు

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది.

Hyderabad Rains: హైదరాబాద్‌ వర్షాలకు చిత్తవుతోంది. మూడు రోజుల నుంచి వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. తెలిపిరి ఇవ్వకుండా పడుతున్న జల్లులతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. పనులు మానుకోలేక.. బయటకు వెళ్లలేక ఇంట్లో ఉండలేకపోతున్నారు. కాసేపు ఆగినట్టే ఆగి ఒకేసారి దంచి కొడుతోంది. మూడు రోజుల నుంచి హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి ఉంది. 

హైదరాబాద్‌లో మరో ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జోన్ల వారీగా ఏరోజు ఏ స్థాయిలో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరి లింగంపల్లి జోన్లలో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. 21, 22వ తేదీల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచంచింది. 23, 24వ తేదీల్లో తేలిక పాటి వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. 

హైదరాబాద్ లో ఇలా..

‘‘ఆకాశం సాధారణంగా మేఘావృతంమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నిర్విరామంగా కురుస్తుంది. కొన్నిసార్లు భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీలు, 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఉపరిత గాలులు పశ్చిమ, నైరుతి దశ నుంచి గంటకు 12 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 97 శాతంగా నమోదైంది. అలాగే 43.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 

హైదరాబాద్‌లోని అన్ని జోన్‌లలో ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 21 22 తేదీల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. 23 నుంచి వాతావరణ సాధారణ పరిస్థితికి చేరుకుంటుంది. అందుకే ప్రభుత్వం కూడా అప్రమత్తమై తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రెండు రోజుల పాటు బడులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటన వచ్చే సరికి చాలా మంది పిల్లలు స్కూల్స్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యులు వారిని తిరిగి ఇంటికి పంపించారు. Hyderabad Rains: హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌- అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న అధికారులు

రెండు రోజులు పాటు వర్షాలు దంచికొట్టనున్నాయన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరి నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే  నాలాలు పొంగడంతో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారాలు నీట మునిగాయి.

హైదరాబాద్‌లో పలు చోట్ల  చెట్లు విరిగిపడ్డాయి. దీంతో జిహెచ్ ఎంసీకి  60కిపైగా ఫిర్యాదులు అందాయి. మాదాపూర్ 5 సెం.మీ, కెపిహెచ్ బి 4.98 సెం.మీ, మూసాపేట 4.73 సెం.మీ, జూబ్లీ హిల్స్  4.65 సెం.మీ. మియాపూర్ లో 7.40 సెం.మీ.వర్షపాతం నమోదు అయింది. టోలీ చౌకీ 6.65 సె.మీ, హైదరాదాద్ 5.68 సెం.మీ వర్షపాతం రిజిస్టర్ అయింది. 

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే డిజాస్టర్ ట్రైనింగ్ సెంటర్‌ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చు. ఆ సెంటర్ ఫోన్‌ నెంబర్లు- 9000113667, 04029555500, 040-29860528, 040-29560584, 040-29560591 వీటితోపాటు సోషల్ మీడియా వేదికగా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. Image

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget