Telangana Rains Alert: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Hyderabad Rains | హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్‌లో మూడు గంటలపాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

Telangana Weather News Today | హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, సికింద్రాబాద్, మదాపూర్, కొండాపూర్, మెహిదీపట్నం సహా పలు ప్రాంతాల్లో ఎడలెరిపి లేని మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ఏరియాలలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
HyderabadRains UPDATE 1 🌧️
— Telangana Weatherman (@balaji25_t) July 23, 2025
Dear people of Hyderabad, ముసురు weather has arrived. There will be CONTINOUS SHOWERS from here on till next 3hrs. Whenever you step out, raincoat/umbrella is mandatory today. It won't be heavy, but continuously showers are expected ⚠️🌧️
హైదరాబాద్‌లో మరో మూడు గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు వెంట గొడుగు తీసుకెళ్లాలని, లేకపోతే రెయిన్ కోట్ ధరించాలని సూచించారు. అతి భారీ వర్షాలు లేకున్నా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుందని అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల నుండి తక్షణమే ఖాళీ చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు
బుధవారం ఉదయం రెండు గంటలపాటు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జనగాం జిల్లా్ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు
హైదరాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, మంచిర్యాలు, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది..
జగిత్యాల, మెదక్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలలో బుధవారం మోస్తరు వర్షం కురవనుండగా, గంటకు 41 - 61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి .నిలిచి ఉన్న నీళ్లు ఉన్నచోట జాగ్రత్తగా ఉండాలని, అన్ని జిల్లాల్లో అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.






















