అన్వేషించండి

Rainbow Children Hospitals: ప్రతిష్టాత్మకమైన జేసీఐ అక్రిడిటేషన్ పొందిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బర్త్ రైట్ బై రెయిన్ బో

రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్'ని పొందినట్లు వెల్లడించింది.

'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్' పొందిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్, ఉమెన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్'ని పొందినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ ఫెసిలిటీ యొక్క నాణ్యతను ఈ  అక్రిడిటేషన్ గుర్తించింది. ప్రపంచ స్థాయిలో అసాధారణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో హాస్పిటల్ అంకితభావం ఈ గుర్తింపు ద్వారా  మరొకసారి నిరూపితమైంది.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్,  మేనేజ్‌మెంట్ మరియు సెంటర్‌లో ఏర్పాటు చేసిన  చికిత్స ప్రోటోకాల్ యొక్క ఖచ్చితమైన ప్రమాణాలతో మెరుగైన మరియు అధునాతన రోగుల సంరక్షణను అందిస్తోందని ఈ అక్రిడెటిటేషన్ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అక్రిడిటేషన్‌ను పొందడానికి మొత్తం ఆసుపత్రి యొక్క నిబద్ధత పాటించడంతో పాటు JCI ద్వారా నిర్దేశించబడిన 13 అధ్యాయాలతో పాటు 1200 అంశాల చెక్‌లిస్ట్‌ ను పాటిస్తున్నట్టు నిరూపణనివ్వాలి.
ఈ ఘనతను అందుకోవటం పై రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బర్త్‌రైట్ బై రెయిన్‌బో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ.. “మేము ఎల్లప్పుడూ నాణ్యమైన సంరక్షణను అందించడాన్ని విశ్వసిస్తుంటాము. ఈ అక్రెడిటేషన్ సాధించడం, రెయిన్ బో కుటుంబంలోని ప్రతి ఒక్కరి విజయం. ఈ గుర్తింపు మా టీం వర్క్ కు ప్రతీక. అంతేకాదు,  మా వైద్యులు, నర్సులు మరియు ఇతర సిబ్బంది అందించిన ప్రేమతో కూడిన  సంరక్షణ, ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేయడంలో మా  సమిష్టి కృషికి మరియు నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. మేము, మా రోగులకు భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము" అన్నారు. ఇంతకుముందు, కొండాపూర్‌లోని  బర్త్‌రైట్ ఫెర్టిలిటీ బై రెయిన్‌బో హాస్పిటల్స్ కు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) గుర్తింపు లభించిందన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్, డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల మాట్లాడుతూ.. "మా లక్ష్యం అసాధారణమైన రీతిలో పీడియాట్రిక్ కేర్ అందించటం. మేము మొదటి నుంచి ఒక బృందంగా, అంచనాలను అధిగమించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. మేము, సమిష్టిగా , మా విస్తృతమైన పరిజ్ఞానం, ఉత్తమ అభ్యాసాలకు కట్టుబడి ఉండటం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, అర్హత కలిగిన వైద్య నిపుణులు మరియు పారామెడిక్ సిబ్బంది మరియు చికిత్స ప్రోటోకాల్‌ల ద్వారా దీనిని సాధించాము. ఈ  JCI అక్రిడిటేషన్ మా అంకితభావానికి నిదర్శనం గా నిలుస్తుంది మరియు రోగి సంరక్షణలో మేము అవలంబించే సమగ్ర విధానాన్ని పునరుద్ఘాటిస్తుంది. JCI గుర్తింపు చిన్న అంశం కాదు; దీనికి క్లినికల్ నాణ్యత మరియు రోగి భద్రతకు గణనీయమైన అంకితభావం చూపాల్సిన అవసరం ఉంటుంది.  ఈ అక్రిడిటేషన్ మా ఆసుపత్రికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది మరియు నిరంతర అభివృద్ధి దిశగా సాగుతున్న మా ప్రయాణాన్ని ప్రోత్సాహిస్తుంది" అని  డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల అన్నారు.
“బర్త్‌రైట్‌లో, మా వద్దకి వచ్చే దంపతులకి, మేము ఎల్లప్పుడూ ప్రెగ్నన్సీని ప్రత్యేకమైన, సురక్షితమైన మరియు సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాము.  JCI అక్రిడిటేషన్ ద్వారా మేము అద్భుతమైన వైద్య & కార్యాచరణ ప్రక్రియలు, సుశిక్షితులైన, సమర్ధవంతమైన సిబ్బంది, అద్భుతమైన సాంకేతికతతో కూడిన సురక్షితమైన క్లినికల్ వాతావరణం కలిగి ఉన్నామని మా రోగులకు మరోసారి పునరుద్ఘాటమయ్యింది " అని బర్త్ రైట్ బై  రెయిన్ బో హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి అన్నారు. 
ఈ విజయంపై రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బర్త్‌రైట్ బై రెయిన్‌బో, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ కె మాట్లాడుతూ.. "ఐదు రోజుల పాటు హాస్పిటల్  కార్యకలాపాలు, క్లినికల్ ప్రోటోకాల్‌లు, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు, రోగి మరియు ఉద్యోగుల భద్రత మరియు అటువంటి అనేక ప్రమాణాలతో ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత,  నాణ్యత పరంగా  అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్నందున మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన JCI గోల్డ్ సీల్ అక్రిడిటేషన్‌ను ప్రదానం చేసింది" అని  అన్నారు. జాయింట్ కమీషన్ ఇంటర్నేషనల్ తరఫున అమెరికా నుండి ఇద్దరు మరియు తైవాన్ నుండి ఒకరు ఈ పరిశీలన నిర్వహించారు.
“రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యొక్క దృఢ సంకల్పం మరియు దార్శనిక దృక్పథం ఈ ప్రతిష్టాత్మకమైన అక్రిడిటేషన్‌ను పొందేందుకు దారితీసింది. ఈ విజయం మాలో ప్రతి ఒక్కరిలోనూ ఒకింత  గర్వాన్ని నింపే అద్భుతమైన క్షణం” అని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిఓఓ సంజీవ్ సుకుమారన్ అభిప్రాయపడ్డారు.
JCI ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నాణ్యత మరియు రోగి భద్రతను మెరుగుపరచడానికి విలువైన పరిజ్ఞానం అందిస్తోంది. దీని సమగ్ర ప్రమాణాలు, వివిధ ఆరోగ్య సంరక్షణ డొమైన్‌లను కవర్ చేస్తాయి, వీటిలో సంరక్షణ, రోగి అంచనా, మందుల నిర్వహణ, నాణ్యత మెరుగుదల మరియు మరిన్నిఅంశాలు ఉన్నాయి. JCI అక్రిడిటేషన్ అత్యంత గౌరవనీయమైనది, ఎంపిక చేసిన సంస్థలకు మాత్రమే అందించబడుతుంది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన తరువాత ఈ గుర్తింపు అందించారు.  
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, 1999లో ఏర్పాటై, ఇప్పటికి, రెండు దశబ్దాలకు పైగా అనుభవంతో, క్లినికల్  మరియు నాన్-క్లినికల్ విధానాలలో గ్లోబల్ క్వాలిటీని కష్టపడి నిర్మించింది, తమ  రోగులకు అందించే సేవల్లో నాణ్యత మరియు భద్రతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహిస్తోంది. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇదే ప్రమాణాలతో దేశవ్యాప్తంగా 6 నగరాలలో 16 బ్రాంచీల లో చిన్నపిల్లలు మరియు స్త్రీలకు సేవలందించడం గమనార్హం.
మరిన్ని వివరాలకు: 
గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా ప్రశాంత్: 99591 15050

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Embed widget