By: ABP Desam | Updated at : 09 Jun 2022 02:57 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక (Jubilee hills Minor Girl Rape) గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ఐదుగురు మైనర్లు అన్న విషయం తెలిసిందే. ఆ నిందితులుగా ఉన్న వారిని కేసు విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత జరిగే విచారణ సమయంలో నిందితులుగా మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ఒక్కడే 18 ఏళ్లు నిండిన వ్యక్తిగా ఉన్నాడు.
ఇతణ్ని రిమాండ్ కోసం చంచల్ గూడ జైలుకు పంపారు. ఆ తర్వాత పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరగా.. నాంపల్లి కోర్టు 3 రోజుల కస్టడీని మంజూరు చేసింది. అందులో భాగంగా నేడు చంచల్ గూడ జైలు నుంచి సాదుద్దీన్ ఖాన్ ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసు విచారణలో సాదుద్దీన్ నుంచి సేకరించనున్న సమాచారం కీలకం కానుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా చేయనున్నారు. ఇందులో భాగంగా ఆమ్నేషియా పబ్, కాన్ సీ యూ బేకరీ, అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లనున్నారు. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఇన్నోవా కారును దాచి పెట్టిన ఫాంహౌజ్ ప్రాంతానికి కూడా సాదుద్దీన్ ను తీసుకెళ్లనున్నారు.
చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించే అవకాశం
మరోవైపు, మైనర్లు అయిన నిందితులను జువైనల్ హోంలో ఉంచారు. వీరి కస్టడీ కోసం పోలీసులు జువైనల్ కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. తీవ్ర నేరాలకు పాల్పడిన సందర్భాల్లో చట్ట ప్రకారం మైనర్లను మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన సవరణను బోర్డుకు తెలపనున్నారు.
నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లకు ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు కూడా చేస్తారు. వారికి లైంగిక పటుత్వ పరీక్ష కూడా ఇందులో భాగంగా ఉంటుంది. చార్జిషీట్ దాఖలకు ఈ పరీక్ష కీలకం కావడంతో కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం.
Mlc Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే, కేటీఆర్ కూడా స్పష్టం చేశారు - ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
GHMC: హైదరాబాద్ అభివృద్ది వైపు జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు - టార్గెట్ 2024 జనవరి !
ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత
Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ - చివరి టీ20లో భారత్ భారీ స్కోరు
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్