News
News
X

Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త ట్రాఫిక్ రూల్స్! ఉల్లంఘిస్తే అక్కడికక్కడే రూ.వెయ్యి ఫైన్ వసూలు

జీబ్రా క్రాసింగ్ వద్ద స్టాప్ లైన్ ను దాటేసి వెళ్తే ప్రస్తుతం రూ.100 ఫైన్ వేస్తుండగా, నేటి నుంచి అది రూ.200 కు పెరిగింది. జంక్షన్ల దగ్గర ఫ్రీ లెఫ్ట్ వదలకుండా కవర్ చేసినా భారీ ఫైన్ పడనుంది.

FOLLOW US: 
 
హైదరాబాద్ లో నేటి నుంచి భారీ ట్రాఫిక్ జరిమానాల విధాన్ని అమలు చేశారు. దీన్నే ‘రోడ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌క్రోచ్ మెంట్’ అంటారు. అంటే, రోడ్ల పక్కల అడ్డంకి కలిగించేలా పార్కింగ్ చేయడం లాంటివి చేయకూడదు. జంక్షన్ల దగ్గర ఫ్రీ లెఫ్ట్ వదలకుండా కవర్ చేసినా ఫైన్లు వేయనున్నారు. పాదచారులు రోడ్డు దాటే చోట తెలుపు రంగు స్టాప్ లైన్ దాటకుండా వచ్చినా భారీగా ఫైన్లు బాదనున్నారు.

కొత్త ధరలు ఇలా..
జీబ్రా క్రాసింగ్ వద్ద స్టాప్ లైన్ ను దాటేసి వెళ్తే ప్రస్తుతం రూ.100 ఫైన్ వేస్తుండగా, నేటి నుంచి అది రూ.200 కు పెరిగింది. జంక్షన్ల దగ్గర ఫ్రీ లెఫ్ట్ వదలకుండా కవర్ చేస్తే వారికి రూ.1000 జరిమానా విధించనున్నారు. పాదచారులు నడిచే ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే దుకాణదారులకు జరిమానా పడనుంది. ఫుట్ పాత్ లపై పార్కింగ్ చేస్తే రూ.600 జరిమానా పడనుంది. ఈ ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా హైదరాబాద్ సీపీ పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. నేటి నుంచే ఈ రోప్ విధానం అమలైంది.

భారీగా పెరిగిన వాహనాల వినియోగం 
హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అంతకుముందు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడే వారు కూడా కొవిడ్ తర్వాత సొంత వాహనాలను అలవాటు పడ్డారు. దిగువ మధ్య తరగతి కూడా తంటాలు పడి సొంత వాహనం కొనుక్కున్న వారూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో రోజు దాదాపు 77.5 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలో తేలింది. 2019తో పోలిస్తే ఏకంగా 18 శాతం పెరిగాయి. బైక్ లే అత్యధికంగా దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. మరో 14 లక్షల కార్లు ఉన్నాయని పోలీసుల అధ్యయనంలో తేలింది. అయితే, సాధారణ జనాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఈ ట్రాఫిక్ సమస్యపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ సమస్య పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా చెప్పారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్‌ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్తు కోసం రూపొందించిన ట్రాఫిక్‌ పోలీసుల యాక్షన్‌ ప్లాన్‌పై కూడా వివరించారు.

క్యారేజ్‌ వే కోసం ‘రోప్‌’
రోడ్లపై ట్రాఫిక్‌ సాఫీగా కదులుతూ ఉండాలంటే మెయిన్ ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్‌ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం చాలా చోట్ల నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలపడం, ఆ క్యారేజ్ వేను ఆక్రమించడంతో అది కనపడట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్‌ రోప్‌ (రివూవల్‌ ఆఫ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎన్‌కరోజ్‌మెంట్స్‌) చేపడతామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా క్రేన్ వాహనాలతో టోవింగ్‌ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్‌ చేసిన వాహనాలకు క్లాంప్స్‌ వేస్తామని హెచ్చరించారు. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్‌ నంబర్లు ఉంచుతామని అన్నారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్స్‌ సహా ప్రతి భవనానికీ పార్కింగ్‌ ఉండేలా చూస్తామని అన్నారు. 

News Reels

Published at : 03 Oct 2022 12:09 PM (IST) Tags: Hyderabad police Hyderabad Traffic Rules ROPE in Hyderabad New fines in Hyderabad

సంబంధిత కథనాలు

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mancherial News : దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

Mancherial News :  దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

YS Sharmila : 4 గంటలుగా రోడ్డుపైనే వైఎస్ షర్మిల దీక్ష, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

YS Sharmila :  4 గంటలుగా రోడ్డుపైనే వైఎస్ షర్మిల దీక్ష, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

Woman Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ - సేఫ్‌గా ఉన్నానని తండ్రికి ఫోన్, తరువాత ఏమైందంటే !

Woman Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ - సేఫ్‌గా ఉన్నానని తండ్రికి ఫోన్, తరువాత ఏమైందంటే !

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ- బండి సంజయ్

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ-  బండి సంజయ్

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ