News
News
వీడియోలు ఆటలు
X

Revanth Reddy: కొత్త సెక్రటేరియట్ కు వెళ్లేందుకు యత్నం- రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

TPCC Chief Revanth Reddy: హైదరాబాద్ లో టెలిఫోన్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

FOLLOW US: 
Share:

TPCC Chief Revanth Reddy: హైదరాబాద్ లో టెలిఫోన్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సెక్రటేరియట్ వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేత రేవంత్ ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓఆర్ఆర్ లీజు విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అపాయింట్ మెంట్ కోరారు రేవంత్. కానీ ఆయనకు అపాయింట్ మెంట్ లేకున్నా, సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు రేవంత్ ను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ ను అనుమతించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎంపీ అయి ఉండి తనను సెక్రటేరియట్ కు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని రేవంత్ రెడ్డి పోలీసులపై ఫైర్ అవుతున్నారు. కానీ పోలీసులు రేవంత్ ను అడ్డుకోవడంతో గంటపాటు హైడ్రామా నడిచింది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లీజ్ పై నల్లగొండలో మూడు రోజుల కిందట రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓఆర్ఆర్ లీజులో భారీ స్కామ్ జరిగిందని, ఈ కుంభకోణంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఓఆర్ఆర్ లీజ్ స్కాములో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కీలక పాత్రధారులు అన్నారు. వారిద్దరిని వదిలే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ లీజ్ స్కామ్ లో విచారణ సంస్థకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ప్రతీ ఏడాది 700 నుంచి 800 కోట్ల వరకు టోల్ రూపంలోనే..
విదేశీ పెట్టుబడులకు కీలకంగా మారిన ఓఆర్ఆర్ కు ప్రతి సంవత్సరం రూ. 700 నుండి రూ.800 కోట్ల వరకు టోల్ రూపంలోనే వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాంటిది 30 ఏళ్ల కాలానికి ఓఆర్ఆర్ ను కేవలం రూ. 7,380 కోట్లకే లీజుకు ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంత పెద్ద కుంభకోణాన్ని చూస్తూ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ లీజు కుంభకోణంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ 30 ఏళ్ల కాలానికి రూ.7,380 కోట్లకు ముంబయికి చెందిన ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థకు టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో లీజ్ కు ఇవ్వడం తెలిసిందే.

ఈ టెండర్ దక్కించుకునేందుకు నాలుగు కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేయగా.. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఐఆర్బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్ ఖరారు అయింది. ఈ మొత్తం ఒకేసారి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. లీజు కుదరడంతో ఇక నుండి నిర్వహణ నుండి టోల్ వసూలు వరకు ప్రైవేట్ సంస్థ పరిధిలోకి వెళ్లనున్నాయి. గత సంవత్సర కాలంగా దీనిపై హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. మార్చి నెలాఖరుకు టెండర్ గడువు ముగిసిన తర్వాత మొత్తం 4 కంపెనీలు తమ బిడ్లను దాఖలు చేశాయి.

బిడ్లు దాఖలు చేసిన కంపెనీలకు సంబంధించిన వివరాలు పరిశీలించి అధికంగా కోట్ చేసిన సంస్థకు ఓఆర్ఆర్ ను టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో లీజుగు అప్పగించారు. ఇందులో భాగంగా ముంబయికి చెందిన ఐఆర్బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కి బిడ్ దక్కింది. ఓఆర్ఆర్ ను మొత్తం 158 కిలోమీటర్ల మేర నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానమై ఉన్నాయి. ఓఆర్ఆర్ పై ఎక్కి, దిగడానికి 44 పాయింట్లు ఉన్నాయి. అలాగే 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్లు ఉన్నాయి. టోల్ వసూళ్ల కింద్ ఏటా రూ.400 నుండి రూ.450 కోట్ల వరకు ఆదాయం సమకూరి ఏటా 5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.

Published at : 01 May 2023 03:47 PM (IST) Tags: CONGRESS Hyderabad Telangana Secretariat Revanth Reddy TPCC Chief

సంబంధిత కథనాలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?

CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day:  ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?