News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad: పరారీలో ఉన్న మరో ఉగ్ర అనుమానితుడి అరెస్టు, మొత్తం ఆరుకి చేరిన సంఖ్య

జవహర్ నగర్‌ పరిధి బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్ లో పోలీసులు గుర్తించిన అనుమానిత ఉగ్రవాదుల్లో మరో వ్యక్తి అరెస్టు అయ్యారు. ఇప్పటికి నగరంలో ఆరుగురిని గుర్తించగా, ఐదురుగురిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. నేడు పరారీలో ఉన్న వ్యక్తిని కూడా పట్టుకున్నారు. జవహర్ నగర్‌ పరిధి బాలాజీ నగర్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో అయిదుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా అరెస్టుతో ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బ్‌ - ఉత్‌ - తహరీర్‌(హెచ్‌యూటీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్టు అయిన వీరిని కోర్టులో హాజరుపరిచి భోపాల్‌కు తరలించారు.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో సమాచారంతో తొలుత భోపాల్‌లో 11 మందిని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్ పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించారు. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. తాజాగా పట్టుబడ్డ వారిని ప్రశ్నించడం ద్వారా మరికొంత సమాచారం రాబట్టేందుకు అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన మరో 11 మంది ఉగ్రవాదులతో కలిసి హైదరాబాద్ కు చెందిన ఈ ఆరుగురు కాంటాక్ట్ లో ఉన్నట్లుగా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మతమార్పిడి చేసుకున్నట్టు కూడా బయటికి వచ్చింది. నిందితుడు మహ్మద్‌ సలీం పాత పేరు సౌరభ్‌రాజ్‌ వైద్య, అబ్దుల్‌ రహమాన్‌ పాత పేరు దేవీ ప్రసాద్, మహ్మద్‌ అబ్బాస్‌ పాత పేరు వేణు కుమార్‌ అని పోలీసులు గుర్తించారు. అయితే, నిందితులు పేర్లు మార్చుకున్నారా? మతం మార్చుకున్నారా? అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. 

హైదరాబాద్‌లో అరెస్టయిన వారిలో ఓ మెడికల్ కాలేజీ హెచ్ఓడీ మహ్మద్ సలీమ్, ఓ పేరుపొందిన ఎంఎన్సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్, పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్న షేక్ జునైద్ ఉన్నారు. రోజు వారీ కూలీలు మహ్మద్ అబ్బాస్, హమీద్ అనేవారు కూడా ఉన్నారు. మరో రోజు వారి కూలీ మహ్మద్ సల్మాన్ నేడు దొరికాడు. పట్టుబడిన వారికి హిజ్భ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని నిఘా సంస్థలు గుర్తించాయి. అరెస్టైన వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కత్తులు, అలాగే ఇస్లామిక్ జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో ఐసిస్ సానుభూతి పరుడు అరెస్ట్               

గత ఏడాది ఏప్రిల్‌లో  ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు.  పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేఖంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ.. కామెంట్స్ పెడుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా దేశంలో ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నాయన్న అనుమానంతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

Published at : 10 May 2023 05:30 PM (IST) Tags: Madhya Pradesh Police Terrorists Hyderabad Police terror in hyderabad

సంబంధిత కథనాలు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి