అన్వేషించండి

14 రోజుల రిమాండ్‌కు అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

శుక్రవారం అరెస్టైన సాయికృష్ణను శనివారం ఉదయం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న జడ్జి... నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించారు.

గుడికి వచ్చిన అమ్మాయిని వలలో వేసుకొని హత్య చేసిన పూజారి సాయికృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అప్సర హత్య కేసులో శుక్రవారం సాయికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని పూర్తిగా విచారించిన తర్వాత అప్సర డెడ్‌బాడీ ఉన్న ప్రాంతాన్ని వెలికి తీశారు. అక్కడ ఉన్న మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించారు. 

శుక్రవారం అరెస్టైన సాయికృష్ణను శనివారం ఉదయం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న జడ్జి... నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆతన్ని చర్లపల్లి జైలుకు అధికారులు తరలించారు. 

సరూర్‌నగర్‌లో ఉంటున్న సాయికృష్ణ... అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్న అప్సర అనే అమ్మాయితో వివేహాతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా ఉంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సాయికృష్ణతో అప్సరకు గుడిలో పరిచయం ఏర్పడింది. తరచూ అప్సర ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మను అక్క అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. 

ఇది వరకు పెళ్లై ఓ పాపకు తండ్రి అయిన సాయికృష్ణతో అప్సర చాలా ప్రదేశాలకు వెళ్లేది. గోశాలలు, గుడులకు వెళ్లేవాళ్లు. ఈ తిరుగుళ్లు కారణంగా అప్సర ఓసారి గర్భవతి కూడా అయినట్టు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తీసుకొచ్చిందని సమాచారం. 

అప్సర నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు సాయికృష్ణ. అనుకున్నట్టుగానే శంషాబాద్‌ ఏరియాకు తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. కారులో ఆమె రిలాక్స్‌డ్‌ మూడ్‌లో ఉండగానే కారు కవర్‌ ఆమె మొహం వేసి ఊపిరి ఆడకుండా చేశాడు. తర్వాత తనతో తీసుకొచ్చిన రాయితో గట్టిగా తలపై  మోదాడు. అంతే స్పాట్‌లోనే ఆమె చనిపోయింది. 

చనిపోయిన అప్సర డెడ్‌బాడీని కారులోనే ఉంచేసి ఇంటికి వచ్చికారు పార్క్ చేశాడు. రెండు రోజుల పాటు డెడ్‌బాడీ ఆ కారులోనే ఉంది. రెండు రోజుల తర్వాత వాసన రావడంతో రాత్రి వేళ కారు తీసుకుని సరూర్‌నగర్‌ తహశీల్దార్‌ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వినియోగంలేని సెప్టిక్‌ ట్యాంక్‌లో మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో కుక్కి పడేశాడు. దీని తర్వాత రెండు బస్తాల ఉప్పు వేశాడు. ఆమె బ్యాగ్‌, లగేజీ బ్యాగ్ కాల్చేశాడు. కారును శుభ్రం చేసి సైలెంట్ అయిపోయాడు. 

తర్వాత రోజు 2 టిప్పర్ల మట్టి తెప్పించాడు. సెప్టిక్ ట్యాంకులో పోయించాడు. రెండు మ్యాన్‌హోల్స్‌ నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడ్డాడు. మ్యాన్‌హోల్‌ మూతలు తీసుకొచ్చి మ్యాన్‌హోల్స్‌పై ఉంచి కాంక్రీట్‌ పోశాడు. ఆ సమీపంలో ఓ బోరు కూడా వేయించాడు. అది చూసిన వారంతా సాయి చేస్తున్నది సామాజిక సేవ అనుకున్నారే తప్ప అనుమానం రాలేదు. ఇప్పుడు అసలు విషయం తెలిసిన తర్వాత  షాక్ అయ్యారు. 

అప్సర ఇంటికి వెళ్లి తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని నమ్మించాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. ఫిర్యాదులో అప్సరను మేనకోడలిగా చెప్పాడు సాయి. కారులో శంషాబాద్‌ వరకు తీసుకొ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఫ్రెండ్స్‌ కారులో ఎక్కించానని చెప్పాడు. అక్కడే పోలీసులకు చిక్కాడు. 

కేసు దర్యాప్తులో భాగంగా ఆమె తిరిగిన ఏరియా సిసీటీవి ఫుటేజ్‌లు పరిశీలించిన పోలీసులకు సాయిపై అనుమానం వచ్చింది. ఇద్దరి సెల్‌ఫోన్‌లు ఒకే చోట ఉన్నట్టు గుర్తించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సీసీ ఫుటేజీ చూస్తే  అప్సర షాబాద్‌ రోడ్డు మీదుగా నర్కూడ వైపు వెళ్లినట్లు కనిపించింది. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం!మెకానిక్ దుర్మరణం!
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget