Acid Attack: బకెట్లో నీళ్లకు బదులు యాసిడ్, తెలియక స్నానం చేసిన యువతి! హైదరాబాద్లో ఘోరం!
Telangana News: యాసిడ్ మీద పడగానే ఒక్కసారిగా యువతి అరుపులు, కేకలు వేయడం తోటివారు ఆమె వద్దకు వెళ్లారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి చెప్పి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ICFAI University Acid Attack: హైదరాబాద్లో విద్యార్థినీ విద్యార్థులు సరదా ఉద్దేశంతో చేసిన కొంటె పని ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. లా చదువుతున్న విద్యార్థిని యాసిడ్ దాడికి గురయింది. యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్న లేఖ అనే విద్యార్థినిపై యాసిడ్ పడడం ఇప్పుడు సంచలనం అయింది. ఆమె స్నానం చేయాల్సిన బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోశారు. అయితే విద్యార్థిని ఆ విషయం గమనించకుండా స్నానం చేసేందుకు ప్రయత్నం చేసినట్లుగా తోటి విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
యాసిడ్ మీద పడగానే ఒక్కసారిగా లేఖ అరుపులు, కేకలు వేయడం తోటివారు ఆమె వద్దకు వెళ్లారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యానికి చెప్పి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లేఖ పరిస్థితి విమమంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు లా చదువుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వద్దకు వెళ్లి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆమె బకెట్ లో యాసిడ్ ఎవరు పోశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేశారు.