Hyderabad MMTS Trains: ప్రయాణికులకు అలర్ట్, ఈ 7న హైదరాబాద్‌లో మొత్తం ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు - ఎందుకంటే !
Hyderabad MMTS Trains: ఆపరేషన్ ప్రాబ్లెమ్ కారణంగా ఇటీవల ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నారు. మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది.
MMTS Trains Cancelled: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. జంట నగరాలలో తిరిగే పలు ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తూ ద.మ.రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్ ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసినట్లు ముందుగానే ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ ప్రాబ్లెమ్ కారణంగా ఇటీవల ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రత్యామ్నాయం చూసుకోండి..
ఆగస్టు 7న ఆదివారం నాడు ఎంఎంటీఎస్ రైలు సర్వీసు ప్రయాణికులు, ప్రత్యామ్నాయం ఎంచుకుని ప్రయాణం చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యూలర్ ఎంఎంటీఎస్ ప్రయాణికులు ఇబ్బంది పడతారని భావించి, దక్షిణ మధ్య రైల్వే రేపు అన్ని ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చింది. లింగంపల్లి - హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసు, సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Cancellation of 34 MMTS train services @drmsecunderabad pic.twitter.com/EKNpCp9b3X
— South Central Railway (@SCRailwayIndia) August 5, 2022
రద్దయిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు..
లింగంపల్లి - హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు - 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
హైదరాబాద్ - లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు - 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు - 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు - 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసు - 47195
సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు - 47150 సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ లోనూ వెల్లడించింది.
Cancellation of trains due to traffic block @drmned @VijayawadaSCR pic.twitter.com/tjWrnAPBEr
— South Central Railway (@SCRailwayIndia) August 5, 2022
పలు ప్యాసింజర్, స్పెషల్ రైళ్లు రద్దు..
నాగ్‌పూర్ డివిజన్ లో రీ మాడిఫికేషన్, కొన్ని పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.
1. 22620 తిరునల్వేలి - బిలాస్‌పూర్ ఆగస్టు 7
2. 22619 బిలాస్‌పూర్ - తిరుల్వేలి ఆగస్టు 9
3. 22815 బిలాస్‌పూర్ - ఎర్నాకుళం ఆగస్టు 8
4. 22816 ఎర్నాకుళం - బిలాస్‌పూర్ ఆగస్టు 10
5. 22648 కొచువేలి - కోర్బా ఆగస్టు 8, ఆగస్టు 11
6. 22647 కోర్బా - కొచువేలి ఆగస్టు 10, ఆగస్టు 13
7. 12767 హెచ్ఎస్ నాందేడ్ - సంత్రాగచి ఆగస్టు 8
8. 12768 సంత్రాగచి - హెచ్ఎస్ నాందేడ్ ఆగస్టు 10