Hyderabad Metro Offers: నేటి నుంచి హైదరాబాద్ మెట్రోలో అన్‌లిమిటెడ్ ఆఫర్ - సెలవు రోజుల్లో మీ ఇష్టం
Hyderabad Metro Super Saver Card: ఉగాది నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సరికొత్త ఆఫర్ ప్రారంభించింది. రూ.59 చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది.
Hyderabad Metro Rail Offers: హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. అయితే అన్ని రోజుల్లో ఈ ఆఫర్ వర్తించదు. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మైట్రో ప్రయాణికులు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చునని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది. ‘సూపర్ సేవర్ కార్డు’ (Super Saver Card) పేరుతో ఆఫర్ నేటి (ఏప్రిల్ 2) నుంచి వర్తిస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ సూపర్ సేవర్ కార్డును గురువారం ప్రారంభించగా, ఉగాది నుంచి మెట్రో రైలు ఆఫర్ అమలులోకి రానుందని తెలిపారు.
ఆ సెలవు రోజులు ఇవే..
ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ కార్డుతో నిర్దేశిత సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా హైదరాబాద్ మెట్రో రైలులో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా ప్రయాణించవచ్చు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. ప్రతి నెలలో ఆదివారం, రెండో, నాలుగో శనివారాలను సెలవు రోజులుగా పేర్కొంది.
రెగ్యూలర్ సెలవుదినాలతో పాటుగా పండుగ రోజులైన ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో రూ.59 మెట్రో ఆఫర్ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి స్పష్టం చేశారు. ఏ రోజైతే టాపప్ లేదా కార్డ్ రీఛార్జ్ చేస్తారో అదే రోజు మాత్రమే వర్తిస్తుంది. మరో సెలవు రోజు తక్కువ ఖర్చుతో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించాలంటే ఆ నిర్దేశిత సెలవు రోజు కూడా నగదు చెల్లించి ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
Here is the Ugadi surprise you've been patiently waiting for! Our Super Saver Metro Holiday Card is pocket-friendly and provides unlimited benefits for you to truly enjoy the holidays!#Transportation #Convenience #Surprise #SuperSaverMetroHolidayCard #Commute #HyderabadMetro pic.twitter.com/s5x78Y8EZm
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) March 31, 2022
హాలిడే లిస్ట్ ఇలా పొందండి...
హైదరాబాద్ మెట్రోలో తక్కువ రూపాయలు చెల్లించి నిర్దేశిత సెలవు రోజుల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ సెలవు రోజులను మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ (Scan QR Code At Hyderabad Metro Station) స్కాన్ చేసి వివరాలు పొందవచ్చు. లేదా టీ సవారీ యాప్ (T-Savari app) లేదా హైదరాబాద్ మెట్రో వెబ్ సైట్లో సెలవురోజుల వివరాలు ప్రయాణికులు పొందవచ్చు. ‘సూపర్ సేవర్ కార్డు’ (Super Saver Card)ను కేవలం కొనుగోలుదారుడు మాత్రమే వినియోగించుకోవాలి. ఈ కార్డును ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయకూడదని చెప్పారు.
Also Read: KCR Vs Governor: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం!, ఎవరు రాకపోయినా డోన్ట్ బాదర్ అన్న గవర్నర్
Also Read: Weather Updates: బీ అలర్ట్ - ఏపీలో అక్కడ దంచి కొడుతున్న ఎండలు, తెలంగాణలో ఓ రేంజ్‌లో భానుడి ప్రతాపం