By: ABP Desam | Updated at : 20 Apr 2023 12:46 PM (IST)
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పరిస్థితి
హైదరాబాద్ మెట్రోకు ఎప్పుడూ లేనంత ఆదరణ పెరుగుతోంది. ఈ ఎండాకాలంలో, బస్సుల్లో హెవీ ట్రాఫిక్‌లో వెళ్తూ ఉక్కపోతకు తట్టుకోలేక జనాలు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మెట్రో స్టేషన్లు, రైళ్లు బాగా రద్దీగా మారాయి. అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే గురువారం మధ్యాహ్నం ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు. ప్లాట్‌ఫాంలు, ఎస్కలేటర్లు ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపించింది. నాగోల్ నుంచి రాయదుర్గం రూట్ అయితే రైల్లో ఎక్కేందుకు కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. నాగోలు స్టేషన్ కూడా మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది.
సాధారణంగా రద్దీని బట్టి వివిధ సమయాల్లో ప్రతి ఐదు నిమిషాలకు, లేదా ఏడు నిమిషాలకు లేదా పదిహేను నిమిషాలకు మెట్రో రైళ్లను నడుపుతుంటారు. కానీ, నాగోలు, అమీర్ పేట మెట్రో స్టేషన్లలో జనాన్ని చూస్తే, నిమిషానికి ఒక రైలు చొప్పున ఫ్రీక్వెన్సీతో నడిపినా జనాల రద్దీ తగ్గేలా కనిపించలేదు. ఎండాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి మెట్రో రైలు సంస్థ సర్వీసుల సంఖ్య పెంచింది. కానీ, గురువారం అనూహ్యంగా ఎప్పుడూ చూడని రీతిలో జనాలు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నాగోలు, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి వివిధ ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపారాలు, చదువుల కోసం జనాలు రాకపోకలు సాగిస్తుంటారు.
చిరు ఉద్యోగస్తులు లేదా విద్యార్థులు బస్సులో ఛార్జీ తక్కువగా ఉంటుందని సాధారణ రోజుల్లో బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు బాగా ఎండలు ముదిరిపోవడంతో చల్లగా ఉంటుందని జనాలు మెట్రో రైళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
ముంబయిలో లోకల్ ట్రైన్ల విషయంలో తరచుగా కనిపించే దృశ్యాలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కనిపించాయి. కరోనా సమయంలో పీక్స్ లో ఉండగా రోజూవారీ ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. మళ్లీ ఇప్పుడు అది నాలుగు లక్షలకు చేరినట్లుగా లెక్కలు అంచనా వేస్తున్నారు. ఈ ఎండాకాలంలో రోజుకు ఐదు లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా
పని చేసే నాయకుడిని దీవించండి- కూకట్పల్లి ప్రజలకు హరీష్ విజ్ఞప్తి
Cyber Security: డిగ్రీలో 'తప్పనిసరి' సైబర్ సెక్యూరిటీ కోర్సు - ఉన్నత విద్యామండలి నిర్ణయం!
Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్మెంట్
MANUU: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టులు!
Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!