By: ABP Desam | Updated at : 04 Jan 2023 01:56 PM (IST)
మెట్రో స్టేషన్ వద్ద సిబ్బంది ధర్నా
హైదరాబాద్ మెట్రో సంస్థలో పని చేసే ఉద్యోగులు చేస్తున్న ధర్నా రెండో రోజు కూడా కొనసాగుతూ ఉంది. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మెట్రో టికెటింగ్ సిబ్బంది నిన్నటి నుంచి (జనవరి 3) నిరసన చేస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో సంస్థ ఆఫీస్ వద్ద టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. మెట్రోలో తమకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడం సహా, తమ జీతం ప్రస్తుతం ఉన్న రూ.11 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి జీతాలు పెంచలేదని వారు వాపోతున్నారు.
నిన్న మంగళవారం కూడా మెట్రో రైల్ టికెటింగ్ సిబ్బంది అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లో నిరసన చేశారు. తమకు జీతాలు పెంచాలని దాదాపు 300 మంది ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్టేషన్స్ లో టికెట్ కౌంటర్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు దాదాపు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని వాపోయారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఉద్యోగం విషయంలోనూ చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఒకరు ఉద్యోగం చేస్తుంటే సమయానికి రావాల్సిన రిలీవర్ రాకపోయినా పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి భోజనం చేయడానికి కూడా సమయం ఉండని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు.
నిన్న మెట్రో సిబ్బంది ధర్నా చేయడంతో సిబ్బంది కాంట్రాక్ట్ ఏజెన్సీ అయిన కియోలిస్ సంస్థ వారితో చర్చలు జరిపింది. దాంతో ధర్నా తాత్కాలికంగా విరమిస్తున్నట్లుగా వారు తెలిపారు. వేతనాల పెంపు విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి చెప్తామని హామీ ఇచ్చారు. అయితే, స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ విధులకు హాజరుకాబోమని సిబ్బంది తేల్చి చెప్పారు.
Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్
YS Sharmila : మళ్లీ కేసీఆర్ ను నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు, రైతు బంధు తప్ప అన్ని సబ్సిడీలు బంద్- వైఎస్ షర్మిల
KA Paul On TS Secretariat: నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది - సచివాలయం అగ్నిప్రమాదంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు
Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ
ADR Report : దేశంలో 239 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 486 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు - ఏడీఆర్ రిపోర్టులో సంచలనాలు
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hindenburg Research: కుబేరుడు అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు !
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?