Hyderabad: హైదరాబాద్‌లో నిత్యపెళ్లి కొడుకు అరాచకం! భార్యకు నాలుగు సార్లు అబార్షన్
Hyderabad News: భార్య బతికి వుండగానే చనిపోయిందని అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈయన తన భార్యకు నాలుగు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించినట్లుగా ఫిర్యాదు నమోదైంది.
![Hyderabad: హైదరాబాద్‌లో నిత్యపెళ్లి కొడుకు అరాచకం! భార్యకు నాలుగు సార్లు అబార్షన్ Hyderabad man forcibly aborted wife for four times simultaneously case filed on saroor nagar PS Hyderabad: హైదరాబాద్‌లో నిత్యపెళ్లి కొడుకు అరాచకం! భార్యకు నాలుగు సార్లు అబార్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/20/6bb3cc4d7c3cb299ab1a22b1999842811708410047216234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad latest News: హైదరాబాద్ లో నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు వెలుగు చూశాయి. భార్య బతికి వుండగానే చనిపోయిందని అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. ఈయన హై కోర్ట్ లో న్యాయవాదిగా చలామణి అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తన భార్యకు పదే పదే ఆడపిల్లలే పుడుతున్నారని ఆమెకు ఏకంగా నాలుగు సార్లు అబార్షన్ చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. వారికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ ఇల్లీగల్ గా స్కానింగ్ చేసి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే అమరేందర్ 4 సార్లు అబార్షన్ చేయించినట్లుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య బతికి ఉన్నా చనిపోయిందని వేరే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక ఇతను రాజకీయాల్లోనూ జోక్యం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ రైతు రాజ్య సమితి (TRS) అనే ఒక పార్టీని అమరేందర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. అమరేందర్ తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అంటూ పలువురిని మోసం చేస్తున్నారని బాధితురాలు కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికే సరూర్ నగర్ ఉమెన్ పీఎస్ లో అమరేందర్ పై కేసు నమోదు అయింది. అమరేందర్ బారిన పడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలైన అమరేందర్ భార్య వేడుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)