hyderabad fire accident: మూడు రోజులైనా అదుపులోకి రాని జీడిమెట్ల ఫ్యాక్టరీ మంటలు - ఆరిపోకుండా తగలబడుతున్న ఆ కెమికల్ ఏమిటంటే ?
Jeedimetla : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇంకా అదుపులోకి రాలేదు. గత మూడు రోజులుగా తగలబడుతున్న SSV ఫ్యాబ్ ఇండస్ట్రీ. ఏకంగా వందలకోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా.
hyderabad fire accident news: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లి రోడ్డులో ఉన్న ఎస్ ఎస్ వి ఫ్యాబ్ ఇండస్ట్రీలో గత మూడు రోజులగా మంటలు అదుపులోకి రాలేదు. ఏకంగా 150కి పైగా ఫైర్ ఇంజన్లతో నీళ్లు చల్లి మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మంటలు ఆగినట్లే ఆగి కాసేపట్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పొగలు భారీగా చుట్టుముట్టి స్దానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏకంగా మూడురోజుల పాటు ఫైర్ సిబ్బందికి చుక్కులు చూపించిన భారీ అగ్నిప్రమాదం ఇదే. అద్రుష్టవశాత్తు ప్రాణనష్టం లేదు కానీ మంటల తీవ్రత మాత్రం అంతకన్నా రెట్టుంపు స్దాయిలోనే ఉంది.
రూ. వంద కోట్లకుపైగా నష్టం
నష్టం కూడా ఊహించనిలో జరిగింది. జీడిమెట్ల ఫ్యాక్టరీ అంటే మహా అయితే కోటి ,రెండు కోట్లు నష్టం వచ్చింది అనుకుంటారు. కానీ ఎస్ ఎస్ వి ఫ్యాబ్ లో జరిగిన అగ్రిప్రమాదంలో ఏకంగా నష్టం వందకోట్లకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతలా మూడురోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టి , ఇప్పటికీ అందుపులోకి మంటలు రాకపోవడానికి ప్రధాన కారణం పాలీప్రొఫైలిన్ అనే కెమికల్. ఈ పరిశ్రమలో భారీ స్దాయిలో ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తుంటారు.ఆ ప్లాస్టిక్ సంచుల తయారీకి అవసరమైన ముడిసరుకు బస్తాలలో ప్యాక్ చేసి భారీ మొత్తంలో నిల్వ ఉంచారు.ఈ ముడిసరుకు లో కెమికలే పాలీ ప్రొఫైలిన్. ఈ కెమికల్ కారణంగానే ఏకంగా నాలుగు అంతస్తుల బిల్డింగ్ పేకమేడలా కూలిపోయింది. అంతేకాదు కూలిన శిధిలాలు, అప్పటికే నిల్వ ఉంచిన ప్లాక్టిక్ ముడిసరుకుపై పడి ,వాటిని పూర్తిగా కప్పేయడంతో మంటలు క్రింద నుండి పైకి ఎగసిపడుతున్నాయి.
శిథిలాల కింద మంటలు
పైన కనిపించే మంటలు అతికష్టంమీద ఆపుతున్నా, తిరిగి మళ్లీ లోపల నుండి మంటలు మొదలవ్వడం , పొగ పరిసరప్రాంతమంతా వ్యాపించడంతో స్దానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జెసిబిల సాహాయంతో కూలిన శిధిలాలు తొలగించి, క్రింద నిల్వ ఉన్న ప్లాస్టిక్ ముడిసరుకును బయటకు తీస్తూ ,వాటిపై నిరంతరంగా నీళ్లు చిమ్ముతూ అతి కష్టంమీద మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా కెమికల్ ప్రబావంతో మంటలు వెనక్కు తగ్గడంలేదు. ఆక్సిజన్ తగిలిన వెంటనే కెమికల్ మరింతగా మంటలకు ఎగిసిపడుతున్నాయి. అతి కష్టంమీద మంటలను కాస్త అదుపులోకి తెచ్చినా పూర్తిగా కట్రోల్ చేయాలంటే మరోఇరవైనాలుగు గంటలు పట్టేట్లుంది.
ఇప్పటికీ యాజమన్యం నిర్లక్ష్యం
ఇంతలా భారీ అగ్నిప్రమాదం జరగడంలో SSV ఫ్యాబ్ ఇంస్ట్రీ యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది.కనీసం ఫైర్ సేప్టీ ప్రమాణాలు ఏ మాత్రం పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ సేప్టీ లైన్ ఒక్కటే ఉండటం అదికూడా సరిగా పనిచేయకపోవడంతో మంటలు మరింతగా వ్యాపించడానికి మరో కారణంగా చెప్పవచ్చు. ఫైర్ ప్రివెంట్ సిలిండర్స్ కూడా మూలన పడేసి ఉన్నాయి. ఫైర్ సేప్టీ టూల్స్ సైతం పనిచేకపోవడం చూస్తుంటే యాజమాన్యం తీరుపై , తనఖీ చేయాల్సిన అధికారులపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం తీవ్రత,కారణాలపై వివరణ అడిగే ప్రయత్నం చేయగా యాజమాన్యం నుండి ఎటువంటి స్పందనలేదు సరికదా ప్రవేటు భద్రతా సిబ్బందిని పెట్టి మీడియాపై దౌర్జన్యం చేసేందుకు సిద్దయ్యింది SSV యాజమాన్యం.