అన్వేషించండి

Hyderabad IT Scam: హైదరాబాద్ లో మరో భారీ ఐటీ కుంభకోణం - విజయవాడలోనూ అధికారుల తనిఖీలు

Hyderabad IT Scam: హైదరాబాద్ లో రూ.40 కోట్ల భారీ ఆదాయ పన్ను రీ ఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. ఈక్రమంలోనే హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించారు.

Hyderabad IT Scam: ఆదాయపు పన్ను శాఖ రూ.40 కోట్ల పన్ను రీఫండ్ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. ఈ విషయమై హైదరాబాద్, విజయవాడలోని ఐటీ అధికారులు సోదలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను రీఫండ్ విషయమై  ఎనిమిది మంది టాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వే, పోలీసు శాఖకు చెందిన చాలా మంది ఉద్యోగులు...  హైదరాబాద్, విజయవాడలోని అనేక టెక్నాలజీ కంపెనీలు ఈ కుంభకోణంలో పాలు పంచుకుని గుర్తించారు. బుధవారం రోజు నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలి పురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ దర్యాప్తు విభాగం అధికారులు సర్వే నిర్వహించారు. ప్రమేయం ఉన్న ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులపై కేసులు పెట్టేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులు జారీ చేసి మరీ విచారించనున్నారు. 

ఉద్యోగులు అర్హులు కానప్పటికీ.. కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్లను రూపొందించి సెక్షన్ 80సీసీ, సెక్షన్ 80డీడీ ప్రకారం సరైన డాక్యుమెంటేషన్ లేకుండా రిటర్న్ లు దాఖలు చేశారని ఆదాయపన్ను శాఖ అధికారులు వివరించారు. ఇలా చేయడం వల్ల ఒక్కో కన్సల్టెంట్ దాదాపు 500 నుంచి 1000 వరకు ఐటీ దాఖలు చేశారని చెప్పుకొచ్చారు. కన్సల్టెంట్లు నేరుగా లేదా వారి ఏజెంట్ల ద్వారా రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఉద్యోగులను సంప్రదించారని సీనియర్ ఐటీ అధికారి తెలిపారు. కొందరు ఉద్యోగులకు ఇది మోసపూరిత పథకం అనే విషయం కూడా తెలియదని పేర్కొన్నారు. అలాగే కమీషన్ కోసం వారి ఖాతాల్లో వాపసులను స్వీకరించడానికి కూడా ఇష్టపూర్వకంగా వారు ఆధారాలను అందించారని వెల్లడించారు. 

ఇదే మొదటి సారి కాదు..!

2017లో 200 మంది సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో నకిలీ వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేశారని ఐటీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారణ జరిపి కన్సల్టెంట్లు, ఉద్యోగులపై చార్జిషీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన అభియోగాలలో ఇద్దరు పన్ను కన్సల్టెంట్లపై ఐపీసీ సెక్షన్లు 420 (మోసం), ఐపీసీ 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget