By: ABP Desam | Updated at : 07 May 2022 10:32 PM (IST)
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని సలీమ్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం నగరంలోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్, సలీం నగర్‌లో ఉన్న శ్రీవాణి హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నగా మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగలుగా మారి ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఆసుపత్రి ప్రాంగణంలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎంత మంది పేషెంట్లు, సిబ్బంది ఉన్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీవాణి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఫైరింజన్‌కు, పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. అయితే ప్రమాదం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని సలీమ్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం నగరంలోని ముషీరాబాద్, సలీం నగర్‌లో ఉన్న శ్రీవాణి హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు#Hyderabad #FireAccident @hydcitypolice #Hospital pic.twitter.com/njzHXiLFew
— ABP Desam (@ABPDesam) May 7, 2022
కాగా, గతంలో ఈ హాస్పిటల్ పేరు ఫర్హాత్ హాస్పిటల్ పేరు మీద ఉండేది. ఇటీవల శ్రీవాణి హాస్పిటల్‌గా పేరు మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూ వల్ల జరిగిందా, మరే కారణం వల్ల జరిగిందా అనే విషయంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. ఫైర్ సిబ్బంది సహకారంతో మంటల్ని ఆర్పివేశామని హైదరాబాద్ పోలీసులు ఏబీపీ దేశం ట్వీట్‌పై స్పందించారు.
Good Afternoon Sir: Our Malakpet PS officers with coordination of the Fire officers cleared the fire. Now situation is peaceful.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 7, 2022
Also Read: Guntur Beggar Murder : ఇడ్లీ ఇస్తే తీసుకోలేదని యాచకుడి హత్య, దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Boy Smoking: KGF 2 రాకీ భాయ్లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !