అన్వేషించండి

Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ప్రేమించిన ఫుడ్‌ డెలివరీ బాయ్, నో చెప్పిందని హత్యాయత్నం

Hyderabad Crime News: ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. అతను ఓ ఫుడ్ డెలివరీ బాయ్. గతకొంతకాలంగా తనను పెళ్లి చేసుకోమని అమ్మాయిని వేధించాడు. ఆమె నో చెప్పడంతో గొంతు కోశాడు.  

Hyderabad Crime News: వారిద్దరూ బంధువులు. అయితే అమ్మాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తుండగా.. అబ్బాయి మాత్రం ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తున్నాడు. బంధువులు కావడంతో వీరిద్దరి మధ్య ముందు నుంచీ స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ అప్పడప్పుడూ కలుస్తుండేవారు. అయితే అబ్బాయి ఆమెను లవ్ చేశాడు. పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చాలా సార్లు చెప్పాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. తాజాగా మంగళవారం రోజు రాత్రి బయటకు వెళ్దామని చెప్పి ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడే మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె అందుకు మరోసారి నిరాకరించడంతో వెంట తెచ్చుకుని కత్తి తీసుకొని గొంతు కోశాడు. 

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన 22 ఏళ్ల వాసవి సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ గచ్చిబౌలిలోని హాస్టల్‌లో నివసిస్తోంది. ఆమె సమీప బంధువు చిలకలూరిపేటకు చెందిన 27 ఏళ్ల కొత్త గణేష్ గచ్చిబౌలిలోని ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్ గా పని చేస్తున్నాడు. వాసవిని పెళ్లి చేసుకోవాలని గతంలో గణేష్ ప్రతిపాదించగా.. ఆమె తిరస్కరించింది. మంగళవారం రోజు రాత్రి వాసవి హాస్టల్ లో ఉండగా... ఆమెను పిలిచి బైక్ పై ఓ హోటల్ వద్దకు తీసుకెళ్లాడు.

మరోసారి గణేష్ తన ప్రేమ సంగతి చెప్పాడు. పెళ్లి చేసుకుందామని  ప్రతిపాదన తీసుకువచ్చాడు. మళ్లీ వాసవి నో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో గణేష్ తన బ్యాగులోని కత్తి తీసి వాసవిపై దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతుతోపాటు ముఖం, చేతులపైన వేటు వేశాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా... నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. 

Also Ready: Hyderabad: ప్రేమించలేదని యువతి గొంతు కోయబోయాడు, కానీ అంతలోనే!

రెండు నెలల క్రితం ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోనూ ఇలాంటి ఘటనే..

హైదరాబాద్ లోని ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోరబండలోని బంజారా నగర్ లో ఉంటున్న లక్ష్మీ అనే యువతిపై.. సురేష్ అనే యువకుడు హత్యాయత్నం చేయబోయాడు. అమ్మాయి తనను ప్రేమించట్లేదనే కోపంతో గొంతు కోసి చంపే ప్రయత్నం చేయబోయాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. ఈ క్రమంలోనే యువతి గొంతుకు గాయం అయింది. అయితే గాయపడిన యువతిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

గతేడాది ఓయూలో దారుణ ఘటన - యువతిపై ప్రేమోన్మాది దాడి

హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషీరాబాద్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. యువతిపై దాడికి పాల్పడిన నిందితుడు రంజిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Embed widget