By: ABP Desam | Updated at : 03 Dec 2022 12:40 PM (IST)
Edited By: jyothi
హెచ్సీయూలో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం, న్యాయం చేయాలంటూ విద్యార్థుల ఆందోళన!
Hyderabad Crime News: విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఆచార్యులే విద్యార్థులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్ నీచానికి ఒడిగట్టాడు. థాయిలాండ్ నుంచి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థినిపై గత రాత్రి హిందీ బోధించే ప్రొఫెసర్ రవిరంజన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థినిని.. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత యువతి వద్దని వారిస్తున్నా వినకుండా ఆమెపై చేతులు వేయడం, ముద్దుపెట్టుకోబోవడం వంటివి చేశాడు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. అనంతరం యువతిని స్వయంగా కారులో తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లినట్లు సమాచారం.
ఇప్పటికే ఆ ప్రొఫెసర్ పై మూడు కేసులు ఉన్నట్లు సమాచారం..
అక్కడి నుండి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన ప్రొఫెసర్ రవిరంజన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదంటున్నారు విద్యార్థులు.
బాధితురాలు థాయిలాండ్ ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే గత నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ పై ప్రొఫెసర్ రవి రంజన్ ఉపన్యాసం ఇవ్వడం విశేషం. మహిళా సాధికారత మీద ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థినిల మీద లైంగిక దాడికి పాల్పడడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
"హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. 354 ఐపీసీ కింద కేసు నమోదు చేశాము. బుక్ కోసం క్యాంపస్ బయటికి పిలిచి అత్యాచారం చేయబోయాడు. ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం.బాధితురాలి స్టేట్మెంట్ బట్టి సెక్షన్స్ యాడ్ చేస్తుము." - మాదాపూర్ డిసిపి శిల్పవల్లి
విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హెచ్ సీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
"హెచ్ సీయూలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా మెచ్యూర్డ్ పీపుల్. అయితే విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి కూర్చొని తాగడం చాలా సార్లు జరుగుతుంటుంది. అయితే విద్యార్థిని ప్రొఫెసర్ రవిరంజన్ వీకెండ్ కావడంతో రాత్రి 10.30 గంటలకు మద్యం సేవించారు. కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఆమె అతడికి సహకరించినట్లు కాదు. కానీ వారి కలిసి మద్యం తాగాకా ప్రొఫెసర్ విద్యార్థినిపై చేతులు వేయడం, ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయడం దారుణం. ఆమె వద్దని చెప్పినా వినకుండా ఆమెను కొట్టడం, ఆపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని పోలీసుల వద్దకు చేరుకుంది. ఇలాంటి ప్రొఫెసర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి". -హెచ్ సీయూ విద్యార్థి
ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
Himanshu Heads CAsnival : ఈ కాస్నివాల్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి, ఈవెంట్ డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువు పునరుద్ధరణ- హిమాన్షు
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
BJYM Protest : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం అధ్యక్షుడికి గాయాలు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!