Hyderabad Traffic: హైదరాబాద్‌లో చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్, నరకయాతన పడుతున్న వాహనదారులు! ఈ ప్రాంతాల్లో భారీగా
రోడ్లపైన వాన నీళ్లు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రమైన అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లో మళ్లీ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు గంట పాటు కురిసిన వర్షానికి ఫలితంగా నగరంలో అన్ని ప్రధాన చోట్ల ట్రాఫిక్ కిలో మీటర్ల కొద్దీ ఏర్పడింది. రోడ్లపైన వాన నీళ్లు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రమైన అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
I think before the concept of Remote or Hybrid working policies was forced to withdraw, #Hyderabad should have had this planned better. #Hyderabadtraffic #KTR #congestion pic.twitter.com/UcrGruCxgR
— Milind Damare (@milinda143) July 24, 2023
ఖైరతాబాద్, పంజాగుట్ట, నిమ్స్ హాస్పిటల్, అమీర్ పేట, తీగలవంతెన - ఐకియా జంక్షన్, ఐకియా జంక్షన్ (మైండ్ స్పేస్ కూడలి) చుట్టుపక్కల మార్గాలు, మాదాపూర్ - కొండాపూర్ మార్గాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గూగుల్ మ్యాప్స్ లో సైతం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే సూచికగా రెడ్ కలర్ కనిపిస్తోంది.
ఇటు కర్బాలా మైదాన్, పార్క్ లేన్, రొచా బజార్, జేమ్స్ స్ట్రీట్, అజామ్ హోటల్, రాణి గంజ్ నుంచి కర్బాలా మైదాన్ మార్గాలు సహా.. అప్పర్ ట్యాంక్ బండ్, లేపాక్షి, చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో కూడా చాలా నెమ్మదిగా వాహనాల కదలిక ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ప్రాంతాల్లో చిక్కడ్ పల్లి, బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండి వాహనాలను నియంత్రిస్తున్నారని వెల్లడించారు.
Traffic on Ikea road, Hyderabad. Received on WhatsApp. Reason for the jam towards Bio Diversity junction is water logging just before the left turn towards Khajaguda lake, DPS etc. There five or six lanes of traffic is reduced to one lane due to water logging. pic.twitter.com/Nof45uV0xS
— N Siva Senani (@senani_n) July 24, 2023
నల్లకుంట మెయిన్ రోడ్డు, ఫీవర్ హాస్పిటల్, తిలక్ నగర్, శివమ్ రోడ్ ప్రాంతాల్లో అంబర్ పేట్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. శాంతి థియేటర్, నారాయణగూడ వైఎంసీఏ, నారాయణ సర్కిల్ - బర్కత్ పుర సర్కిల్ ప్రాంతాల్లో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారు.
Date: 24-07-2023 at 1927 hrs .
— Hyderabad Traffic Police (@HYDTP) July 24, 2023
Due to heavy Rains and water logging near Karbala maidan, movement of vehicles is slow from Parklane, Rocha Bazar, James Street, Azam Hotel, RAnigunj towards Karbala Maidaan. Begumpet Traffic police are available and regulating traffic. pic.twitter.com/o1YvVs4Msw
కోటి ఉమెన్స్ కాలేజీ, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్, లోవర్ బ్రిడ్జి, ఆర్‌యూబీ, నల్గొండ ఎక్స్ రోడ్స్, మలక్ పేట యశోదా హాస్పిటల్, మలక్ పేట్ మెట్రో ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు బేగంపేట్, ప్రకాశ్ నగర్, రసూల్ పుర, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్, విద్యుత్ సౌధ, ఈనాడు, శ్రీనగర్ కాలనీ, సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజీ, చట్నీస్ ప్రాంతాల్లోనూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date: 24-07-2023 at 1802 hrs .
— Hyderabad Traffic Police (@HYDTP) July 24, 2023
Due to VIP movement, heavy Rains, heavy flow of traffic and also peak hours, movement of vehicles is slow from City Centre, Taj Krishna, GVK One, NFCL towards Panjagutta X Roads. pic.twitter.com/nsozajix2o
Date: 24-07-2023 at 1540 hrs .
— Hyderabad Traffic Police (@HYDTP) July 24, 2023
Due to heavy flow of traffic, movement of vehicles is slow from Vidyut Soudha, EEnadu, KCP, CEO, NIMS towards Panjagutta and from Sri Nagar Colony, SUltan Uloom COllege, Chutneys, NFCL towards Panjagutta. pic.twitter.com/AIYpOvARD3
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఒరిస్సా ఐలాండ్, రోడ్ నెం 92, డైనోసార్ పార్క్, సిటీ సెంటర్, జీవీకే వన్, తాజ్ క్రిష్ణా, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, హైదరాబాద్ జింఖానా, ఎల్వీ ప్రసాద్ మార్గ్, ఎన్టీఆర్ భవన్, పార్క్ హాయత్, సాగర్ సొసైటీ తదితర చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.