అన్వేషించండి

PM Modi Roadshow: హైదరాబాద్ లో ముగిసిన ప్రధాని రోడ్ షో, భారీగా తరలివచ్చిన శ్రేణులు- రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Metro Stations Closed: ప్రధాని మోదీ రోడ్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధంచారు. రెండు గంటలపాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు.

Chikkadpally and Narayanaguda stations closed 2 hours: హైదరాబాద్: నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో ముగిసింది. సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రధాని రోడ్ షో మొదలైంది. నగరానికి వచ్చిన ప్రధానిని చూసేందుకు బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ లోని వీర్ సావర్కర్ విగ్రహం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో కొనసాగింది. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు.

హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రయాణికులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. నేటి (సోమవారం) సాయంత్రం రెండు గంటలపాటు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో (PM Modi Road Show) కారణంగా సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు ఈ రెండు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు తెలిపారు. ప్రధాని రోడ్ షో కు భద్రతాపరమైన కారణాలతో అధికారులు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నారు. ప్రయాణికులు ఇది గమనించాలని ఓ ప్రకటనలో కోరారు. కాగా, సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమై.. అక్కడినుంచి నారాయణగూడ, వైఎంసీఏల మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు కొనసాగనున్న రోడ్ షోలో ప్రధాని ప్రసంగించనున్నారు.

తిరుమల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కరీంనగర్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి కోరుకుంటే బీజేపీకి ఓటు వేయాలని, ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లలో సాయంత్రం 4:45 నుంచి 6:45 గంటల వరకు రైలు ఆగదని ప్రయాణికులకు సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్లోనూ ఆంక్షలు విధించారు.  

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. 
తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగియనుండగా, నేటితో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ప్రధాని మోదీ హైదరాబాద్ లో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహిస్తున్న కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి మొదలై కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల వరకు రోడ్ షో ఉంటుంది. నేటి మధ్యాహ్నం 1 గంటలకే ప్రారంభమైన ట్రాఫిక్ ఆంక్షలు రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనల్ వాహనదారులను అలర్ట్ చేశారు.

బేగంపేట విమానాశ్రయం నుంచి కాచిగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా ఎయిర్‌పోర్ట్ వై జంక్షన్ తో పాటు పీఎన్ టీ ఫ్లై ఓవర్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School), బేగంపేట్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్ లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్ భవన్, వివి స్టాచ్యు, పాత పీఎస్ సైఫాబాద్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇందిరా రోటరీ (నెక్లెస్ రోటరీ), ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్ రోడ్ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Embed widget