By: ABP Desam | Updated at : 01 Dec 2021 12:29 PM (IST)
Edited By: Venkateshk
ఈ-స్కూటర్లు
ఈ స్కూటర్లకు తాళంతో పని లేదు.. వినేందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇలాంటి స్కూటర్లను ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఓ చోట ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ట్వీట్ చేశారు. ఈ స్కూటర్లు పని చేసే ఓ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ ఈ-స్కూటర్లకు తాళం చెవితో పని ఉండదు. ఈ-స్కూటర్ వద్దకు వెళ్లి యాప్‌ను ఆన్ చేసి సెల్ఫీ తీసుకుంటే చాలు.. స్కూటర్ అది స్టార్ట్ అయిపోతుంది. స్కూటర్ నడిపిన తర్వాత ఆ యాప్ ద్వారానే పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హాలా’ అనే మొబిలిటీ యాప్‌ను జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్ స్టేషన్లు తదితర సేవలను తెలుసుకొనే వీలుంది.
ఈ ‘హాలా’ అనే సంస్థ.. ఇప్పటికే పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ-స్కూటర్’ సేవలను అందిస్తూ వస్తోంది. హైదరాబాద్‌లో తాజాగా ఈ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ ఆఫర్ కింద ‘ఈ-స్కూటర్’ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందే వీలుంది. స్మార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. హాలా యాప్ ద్వారా డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించవచ్చు.
ఎలా పని చేస్తుందంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హాలా’ తీరుస్తుందని జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ-వాహనాల వాడకమే లక్ష్యంగా ఈ హాలా యాప్‌ను తయారు చేసినట్లుగా సంస్థ సీఈవో శ్రీకాంత్ రెడ్డి వివరించారు. వచ్చే ఏడాదిలో మొత్తం 6 నగరాల్లో ‘హాలా’ యాప్ ద్వారా పని చేసే 15 వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు.
Hyderabad-based EV Startup @Halamobility's App was launched by Principal Secy ITE&C @jayesh_ranjan, and prominent members of the Startup ecosystem were present. The E-bikes will be deployed soon in the IIIT-Hyd campus as pilot. @KTRTRS @DrShantaThoutam @MinisterKTR @startupindia pic.twitter.com/Cq6RMhwf0o
— Startup Telangana (@startup_ts) November 29, 2021
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !
ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత
Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
Tarakratna Vijayasai : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది - బాలకృష్ణకు ధ్యాంక్స్ చెప్పిన విజయసాయిరెడ్డి !