అన్వేషించండి

Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 

Amaravati Pin code: అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కేంద్రం గెజిట‌ జారీ చేస్తుంది. అనంతర కొత్త పిన్‌కోడ్ కేటాయిస్తారు. అసలు ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పార్లమెంట్ ఆమోదంతో అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ రానుంది.
  • కొత్త పిన్ కోడ్ తో అమరావతికి పోస్టల్ శాఖలో గుర్తింపు లభిస్తుంది.
  • జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం తర్వాత ప్రత్యేక పిన్ కోడ్ మంజూరు చేస్తారు.
  • పిన్ కోడ్ తో పాటు అమరావతికి STD, ISD కోడ్ లు కేటాయింపు.

Amaravati Pin code: ఆంధ్రుల రాజధాని అమరావతికి పార్లమెంటు ఆమోదం రావడంతో  పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమరావతికి చట్టబద్ధతతో పాటు కొత్త పిన్ కోడ్ సైతం వచ్చేస్తుంది. రెండు రోజుల్లో ప్రెసిడెంట్ సంతకంతో అమరావతి తీర్మానం చట్టబద్ధంగా గెజిట్‌లోకి వెళ్ళిపోనుంది. దానితో అమరావతికి తనదైన పిన్ కోడ్ కూడా రాబోతుంది. దానివల్ల వల్ల రాజధానిలో పోస్టల్ శాఖ పరంగా కొత్త ఆస్థిత్వం వచ్చిన్నట్టు అవుతుందని స్థానికులు చెబుతున్నారు.

మారిపోనున్న పాత పిన్ కోడ్ 

ప్రస్తుతానికి రాజధాని అమరావతికి తనదంటూ ఒక పిన్ కోడ్ లేదు. అలా ఉండాలి అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఉండాలి. ఇప్పటికైతే వెలగపూడి పిన్ కోడ్ 522237నే వాడుతున్నారు. సెక్రటేరియెట్ అవసరాల కోసం 5222238ని కూడా వాడుతున్నారు. అమరావతికి కేంద్రం ఆమోదం తెలపడంతో ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన పిన్‌కోడ్‌ను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కోసం అమరావతిలో స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. దానితో ఆ విధమైన అడ్డంకులు కూడా అమరావతికి లేనట్టే. పిన్ కోడ్‌తో పాటు అమరావతికి శాశ్వత STD, ISD కోడ్ లు కూడా కేటాయించనున్నారు.

స్పష్టత ఇచ్చిన తపాలా శాఖ

విజయవాడకు చెందిన ఒక సామాజికవేత్త కమ్ అడ్వకేట్ అడిగిన సమాచారం మేరకు పోస్టల్ శాఖ క్లారిటీ ఇచ్చింది. అమరావతిలో ఆల్రెడీ తమకు కేటాయించిన స్థలంలో జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం అయ్యాక ఉన్నత స్థాయిలో అనుమతి తీసుకుని అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ మంజూరు చేస్తామని పోస్టల్ అధికారులు తెలిపారు.

పిన్ కోడ్ వ్యవస్థ ప్రారంభం అయింది ఇలా!

పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. దీని ద్వారా ఉత్తరాలు చేరవేయడానికి ఇతర పోస్టల్ కార్యకలాపాలను పక్కాగా నిర్వహించడానికి వీలవుతుంది. ప్రతీ పోస్ట్ ఆఫీస్‌కి ఒక ప్రత్యేకమైన పిన్‌కోడ్ ఉంటుంది. ఈ ఆరు అంకెల నెంబర్‌తో పోస్ట్ ఎక్కడికి వెళ్లాలో పక్కాగా తెలిసిపోతుంది. ఈ వ్యవస్థను 15 ఆగస్టు 1972లో ప్రారంభించారు. ఈ ఆరు అంకెల నెంబర్‌లో మొదటి అంకె పోస్ట్ ఆఫీస్ ఉన్న జోన్, రెండో అంకె పోస్ట్ ఆఫీస్ సబ్ జోన్ తెలియజేస్తాయి. ఆ రెండు అంకెలకు మూడో నెంబర్ తోడైనప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉన్న జిల్లా, పోస్టల్ ఏరియా తెలుసుకోవచ్చు. తరువాతి మూడు అంకెలు పోస్టల్ సర్కిల్‌ను పోస్ట్ ఆఫీస్ అడ్రస్ తెలియజేస్తాయి. తెలంగాణకు ముందు రెండు నెంబర్ లు 50గానూ, ఏపీకి 51,52,53  కేటాయించారు.

Frequently Asked Questions

అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ ఎందుకు వస్తుంది?

అమరావతికి పార్లమెంట్ ఆమోదం రావడంతో, దాని చట్టబద్ధతతో పాటు ప్రత్యేక పిన్ కోడ్ కూడా రాబోతుంది. దీనివల్ల పోస్టల్ శాఖ పరంగా అమరావతికి కొత్త గుర్తింపు వస్తుంది.

ప్రస్తుతం అమరావతికి ఏ పిన్ కోడ్ వాడుతున్నారు?

ప్రస్తుతానికి అమరావతికి తనదంటూ ప్రత్యేక పిన్ కోడ్ లేదు. ప్రస్తుతం వెలగపూడి పిన్ కోడ్ 522237, సెక్రటేరియెట్ అవసరాల కోసం 522238 వాడుతున్నారు.

కొత్త పిన్ కోడ్ ఎప్పుడు వస్తుంది?

జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం పూర్తయ్యాక, ఉన్నత స్థాయిలో అనుమతి తీసుకుని అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ మంజూరు చేస్తామని పోస్టల్ అధికారులు తెలిపారు.

పిన్ కోడ్ అంటే ఏమిటి?

పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది ఉత్తరాలను చేరవేయడానికి, పోస్టల్ కార్యకలాపాలను పక్కాగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి పోస్ట్ ఆఫీస్‌కు ఒక ప్రత్యేకమైన ఆరు అంకెల పిన్ కోడ్ ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Dissatisfaction: డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
డిప్యూటీ సీఎం అప్‌సెట్.. ?ఆ పోలీస్ బాస్‌తో ఏం చెప్పారు..?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget