MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
Hyderabad Latest News: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారంటూ కేసు నమోదైంది.
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి. రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై అఫ్జల్ గంజ్ పోలీసులు ఈ కేసు పెట్టారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంగించారంటూ కేసు నమోదైంది.
దీనిపై రాజాసింగ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ‘‘రామ నవమి శోభా యాత్ర సందర్భంగా పలువురు సనాతన ప్రేమికులు.. యాత్రలో వచ్చిన రామభక్తులకు నీరు, భోజన ఏర్పాట్లు చేసి ఊరేగింపునకు సహకరించారు. ఇలా సాయం చేసిన వారిపై పోలీసు శాఖ బలవంతంగా కేసులు బుక్ చేసింది. రంజాన్ మాసంలో రాత్రంతా దుకాణాలు తెరిచి ఉంటాయని, హోటళ్లు తెరిచి ఉంటాయని తెలుసు. అలాంటప్పుడు రంజాన్ మాసంలో ఎన్నికల కోడ్ గుర్తుకు రాలేదా? ముస్లిం సమాజంపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిసారీ వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడల్లా హిందూ మతాన్ని, హిందువులను అణచివేస్తోంది. హిందువులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా, ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.