By: ABP Desam | Updated at : 11 May 2022 02:47 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Rajiv Swagruha Flats For Sale: హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్‌ఎండీఏ (HMDA) శుభవార్త చెప్పింది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారం పరిధిలోని రాజీవ్ స్వగృహ (Rajiv Swagruha) ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 1,082 ఫ్లాట్లలో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల Rajiv Swagruha Flats ధరను చదరపు అడుగుకు రూ.3 వేలు, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకి రూ.2,750గా హెచ్ఎండీఏ (HMDA) నిర్ణయించింది.
Rajiv Swagruha Flats పోచారంలో 1328 ఫ్లాట్లు
ఇక పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. గురువారం నుంచి జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగినవారు మీ సేవ పోర్టల్ (Mee Seva) , కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. రేపటి నుంచి (మే 12) జూన్ 14 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. www.swagruha.telangana.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. మీ సేవ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా వచ్చే నెల 22న ఫ్లాట్లను కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఉన్న ఫ్లాట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తేనే లాటరీ పద్ధతి అవలంబించనున్నారు. ఒకవేళ లాటరీలో పేరు రాకపోతే ఫీజును వెనక్కి తిరిగి ఇవ్వరు. లాటరీలో ఎంపికైన వారికి బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఇవ్వనున్నారు.
Rajiv Swagruha Flats: ఇక 3 BHK డీలక్స్ ఫ్లాట్లలో ఒక హాల్, 3 బెడ్రూమ్స్, 3 అటాచ్డ్ బాత్ రూమ్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ రూమ్, బాల్కనీ సౌకర్యాలు ఉంటాయి. 3 BHK ఫ్లాట్లలో ఒక హాల్, 3 బెడ్ రూం, 2 అటాచ్డ్ బాత్ రూమ్, కిచెన్, పూజ రూమ్, బాల్కనీ ఉంటాయి. 2 BHK ఫ్లాట్లలో హాల్, కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, బాల్కనీ, 1 BHK ఫ్లాట్లలో హాల్, కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, బాల్కనీ ఉన్నాయి.
NIMS: 'నిమ్స్'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే
TS High Court: నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పదేపదే టీఎస్పీఎస్సీ విఫలం - హైకోర్టు ఆగ్రహం
సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్‌టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల
MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్
Asian Games 2023: భారత్ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం
Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?
Kavitha Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు భారీ ఊరట - సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఏమిటంటే ?
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
/body>