News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Heavy Rains in hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు!

Heavy Rains in hyderabad: హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీటిలోనే చాలా మంది తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఉస్మాన్ సాగర్

FOLLOW US: 

Heavy Rains in hyderabad: భాగ్యనగరంలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భారీ వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ బిడీల్ కాలనీ, వనస్థలిపురం గౌతమి నగర్, నాగోల్ అయ్యప్ప కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. అలాగే పలు చోట్ల చెట్టు విరిగి పడిపోయాయు. విషయం తెలుసుకున్న హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఏఈతో కలిసి కాలనీలను సందర్శించారు. వెంటనే డీఆర్ఎఫ్ బృందాన్నిపిలిపించి సహాయక చర్యలు ప్రారంభించమని చెప్పారు. ఈ కాలనీలో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 

పూర్తిగా నీటిమయం అయిన కాలనీలు..

పాతబస్తీ, బహదూర్ పురా, కిషన్ బాగ్, రైన్ బజార్, యాకుత్ పురా, కాలా పత్తర్, ప్రాంతాల్లొ గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భారీ వరదలు పోటెత్తాయి. దీంతో రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. అలాగే ఉప్పల్ లోని పద్మావతి కాలనీలో భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా చేస్తోంది. అడుగు తీసి అడుడు బయట పెట్టాలంటేనే ప్రజలు గజగజా వణికిపోతున్నారు. కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా బయటకు రాలేకపోతున్నారు. 

ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తిన అధికారులు..

ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు వరద ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. దీంతో ఈరోజు ఉదయం 9 గంటలకు 6 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తారు. మొత్తం ఔట్ ఫ్లో 1872 క్యూసెక్కులుగా ఉంది. 

ట్రాఫిక్ పోలీసుల ప్రకటన..

  • భారీ వర్షం, వరదలు తగ్గే వరకు నగర ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
  • ట్రాఫిక్ ను తగ్గించేందుకు పీక్ అవర్స్ లో రోడ్డు పైకి రాకూడదని సూచించారు.
  • వరద నీళ్లలోకి అస్సలే వెళ్లకూడదు.
  • పిల్లలను బయట ఆడుకునేందుకు పంపించడం మంచిది కాదు.
  • ట్రాఫిక్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా, సమస్య ఉన్నా 85004111111 నెంబర్ ను సంప్రదించలచ్చు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపవచ్చు. 

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

హైదరాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో అర్ధ రాత్రి భారీ వర్షం కురిసింది. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో చల్లని గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

గత 20 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యలో ఓ రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాకాలం ప్రారంభంలోనే ఇంత ఎత్తున వర్షాలు కురవడం ఇదే ప్రథమం. భారీ వర్షాల ధాటికి పంటలన్నీ నీట మునిగాయి. చాలా మంది ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. ప్రాజెక్టులు, నదుల సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Published at : 26 Jul 2022 09:50 AM (IST) Tags: heavy rains in hyderabad Heavy Rains in Telangana rains in hyderabad Heavy Floods in Telangana

సంబంధిత కథనాలు

Vijaya Shanthi: కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకి రాముడి కథలే, సీఎం వ్యాఖ్యలపై విజయ శాంతి కౌంటర్

Vijaya Shanthi: కేసీఆర్ చెప్పేవన్నీ తుపాకి రాముడి కథలే, సీఎం వ్యాఖ్యలపై విజయ శాంతి కౌంటర్

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు

Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు

Haritha Haram 2022: 21న తెలంగాణ అంతా హ‌రిత‌హారం, సీఎం కీలక ఆదేశాలు - మంత్రి వెల్లడి

Haritha Haram 2022: 21న తెలంగాణ అంతా హ‌రిత‌హారం, సీఎం కీలక ఆదేశాలు - మంత్రి వెల్లడి

వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"

వెయ్యి కిలోమీటర్లు దాటిన

టాప్ స్టోరీస్

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!

The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్‌తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!