అన్వేషించండి

Harish Rao vs Lokesh : హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు: బనకచర్లపై లోకేష్‌కు సవాల్! ప్రాజెక్టు అడ్డుకొని తీరుతామని కామెంట్!

Harish Rao vs Lokesh : బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని హరీష్‌రావు విమర్శించారు. కాళేశ్వరం, బనకచర్లపై గురువారం లోకేష్ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao vs Lokesh : బనకచర ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు పరిస్థితి మారుతోందని మాజీ హరీష్‌రావు విమర్శించారు. లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతమంటూ మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ ప్రభుత్వం లోపాయికార ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. బనకచర్ల అంశంపై చర్చకు రాబోమని చీఫ్ సెక్రటరీ లేఖ రాస్తే రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల అంశం ఉన్నప్పటికీ చర్చల్లో పాల్గొని పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వచ్చారని ఎద్దేవా చేశారు. ఇదే దైర్యంతో లోకేష్ మాట్లాడుతున్నాడని అన్నారు. బనకచర్ల కట్టి తీరుతా అంటున్నారంటే విమర్శించారు.

బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బిజేపీ, కాంగ్రెస్ మౌనమే కారణమని ఆరోపించారు హరీష్‌రావు. వీళ్ల సహకారంతోనే అంత దైర్యంగా ప్రకటిస్తున్నారని అన్నారు. లోకేష్ ఏమో ప్రాజెక్టు కట్టి తీరుతాం అంటే, రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల కడుతలేరు అంటున్నారని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. 

రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, బిజేపీ డూడూ బసవన్నలాగా చంద్రబాబు చేపట్టే వాటికి తలూపుతున్నారని హరీష్‌రావు అన్నారు. దైర్యంగా మాట్లాడుతున్నరని చెప్పుకొచ్చారు. రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. 

కేంద్ర సంస్థలు బనకచర్ల డీపీఆర్‌ను తిప్పి పంపింది నిజం కాదా?

లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడారని, అధికారం ఉందని, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటని హరీష్‌ సూచించారు. మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్‌ను వెనక్కి తిప్పి పంపిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్‌ను తిరస్కరించాయని నిలదీశారు. "మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొక్క కొట్టుడో, చిల్లు కొట్టుడో ఉండదు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.
పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తు ఊరుకుంటామా
ఇక్కడ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నోళ్లం. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. మీకు వివరాలు పంపిస్తా చూసుకోండి. అనుమతులు లేవు అని ఎలా అంటావు."

కాళేశ్వరంపై రాసిన లేఖలు గురించి కామెంట్స్

ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదని చెబుతున్న లోకేష్ , ఇదే విషయం గురించి మీ నాన్నని అడగండి అని హరీష్‌రావు సూచించారు. "ఒక్క కాళేశ్వరం వ్యతిరేకిస్తూ మీ నాన్న ఏడు ఉత్తరాలు రాశారు. మీరేమో వ్యతిరేకించలేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇచ్చిన అనుమతులు నిలిపి వేయండి, ప్రాజెక్టులు ఆపండి అని లేఖలు రాశారు.
కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహితలో అంతర్భాగం, అందుకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదు అని స్పష్టంగా కేంద్రం పేర్కొన్నది." అని వివరించారు. 

కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకున్నామని గుర్తు చేశారు హరీష్‌రావు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా, నీళ్లు ఏపీకి పోవాలి అనే కుట్ర చేస్తున్నట్లుందన్నారు.ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కట్టి కృష్ణా నదిలో నీళ్లు మళ్లించినట్లు, గోదావరి నీళ్లు మళ్లించాలనేది కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రెండు నదులను హస్తాగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీలో అనేక కుట్రలు జరిగాయని... ఇప్పుడు బనకచర్ల కట్టి తీరుతాం అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

మీరు కట్టితీరుతాం అంటున్నారు, మేము అడ్డుకొని తీరుతాం అంటున్నామని హరీష్‌ సవాల్ చేశారు. మీ ప్రాజెక్టులను అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు, మా హక్కుల గురించి మేం మాట్లాడుతున్నాం అన్నారు. మా వాటా మాకు ఇవ్వండి గౌరవిస్తం, బుల్డోజ్ చేస్తం అంటే సహించేది లేదని తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం కోసం మహారాష్ట్రకు వెళ్లి గవర్నర్, అక్కడి సీఎం ను కలిసారని గుర్తు చేశారు. మూడు సార్లు వెళ్లి ఒప్పించి, మెప్పించారని అన్నారు.

మిగులు జలాలపై విమర్శలు 

సముద్రంలో కలిసే నీళ్లు కదా అంటున్న లోకేష్.. ఉమ్మడి ఏపీ ఉన్నపుడు 968 టీఎంసీలను తెలంగాణకు వాటాగా కేటాయించారని హరీష్‌రావు తెలిపారు. విభజన బిల్లు, శ్రీకృష్ణ కమిటీ అన్నింట్లో ఈ వాటా గురించి ఉందన్నారు. ఇందుకు లోబడి కడుతున్న ప్రాజెక్టులను ఎందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 968 పరిధిలో కట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మరి బనకచర్ల ఎట్ల కడుతున్నారని ఈ ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు ఏంటని ప్రశ్నించారు. "మా నోరు కొడతాం అంటే మాకు హక్కులు లేవా, మేం ఎందుకు ఊరుకోవాలె సూటిగా లోకేష్ అడుగుతున్నా.. 968 టిఎంసీలను అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను విత్ డ్రా చేసుకోండి. గోదావరిపై నిర్మించే మా ప్రాజెక్టులను వ్యతిరేకించారు. విత్ డ్రా చేసుకోండి. గోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లిస్తే ట్రైబ్యునల్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన 155 టిఎంసీలు మాకు ఇస్తమని ఒప్పుకోండి. 1480 టిఎంసీల కంటే ఎక్కువ ఉన్న నీటిని 65:35 ప్రకారం వాటా లెక్క తేల్చాలి." అని ఆరోపించారు.  

విశాఖ ఉక్కుకు బీఆర్‌ఎస్ మద్దతు

"ప్రాంతీయ విద్వేశాలు రెచ్చ గొడుతున్నారని లోకేష్ అన్నారు. గోదావరి నదిలో మా వాటా మాకు కావాలె అంటున్నారు, మిగులు జలాల లెక్క తేలాలి అంటున్నాం, ఇలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నం అంటున్నారు లోకేష్ మీ నాన్న బాబ్లీ మీద కొట్లాడారు, ఆల్ మట్టి మీద కొట్లాడారు. మీ నాన్న ఆరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్లా విశాఖ ఉక్కును కాపాడుకున్నం రెండు సార్లు అంటున్నారు. విశాఖ ఉక్కుకు బనకచర్లకు చాలా తేడా ఉంది. విశాఖ ఉక్కుకు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. బనకచర్లతో తెలంగాణ నీటి హక్కుల ప్రయోజనాలకు దెబ్బ పడుతంది. చంద్రబాబు, జగన్ ను కేసీఆర్ కలిసి మిగులు జలాల్లో వాటా ఉపయోగించుకొని, రెండు రాష్ట్రాలకు వాడుకుందామని చెప్పారు. మీరు చేస్తున్నది బుల్డోజింగ్ రాజకీయం. తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బనకచర్ల కడుతం అంటున్నారు."

"మా వాటా తేలాలి కదా, మా లెక్క తేలాలి కదా. ఒకవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటారు, మరోవైపు 968 టిఎంసీలను వ్యతిరేకిస్తారు. సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే కేసీఆర్, బిఆర్ఎస్ తెలంగాణ హక్కులను కాపాడుతుంది. అనుమతులు తెచ్చుకునే పద్ధతి మీకు తెలిస్తే, ఆపే పద్దతి కూడా మాకు తెలుసు. గోదావరి బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకునే కుట్ర ఉంది. ఈ విషయం చంద్రబాబు నాయుడే చెప్పిండు. నాగార్జున సాగర్ కుడి కాల్వను డబుల్ చేస్తాం అన్నారు. నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డిపిఆర్ ను తిప్పి పంపాయి."

"కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం. అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసు తెలంగాణను అడ్డుకుంటే ఆనాడు కేసీఆర్ శక్తి యుక్తులు ప్రదర్శించి రాష్ట్రాన్ని తెచ్చారని, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బిజేపీ ఎంపీలు ఉండి అడ్జర్నమెంట్ మోషన్ ఇచ్చి ఎందుకు బనకచర్ల మీద నిలదీయడం లేదు" ఎంపీలు ఉన్నది ఎందుకు? తెలంగాణ హక్కులు కాలరాయడానికా, కాపాడటానికా? అవసరం అయితే సర్వోన్నత న్యాయస్థానం వెళ్తాం, హక్కులు కాపాడుకుంటం." అని హరీష్‌ అన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi On Gold Purchase: ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం, చమురు వినియోగం తగ్గిద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ
ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం, చమురు వినియోగం తగ్గిద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
PM Narendra Modi: రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS MI Result Update: టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Sreemukhi New House: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శ్రీముఖి... బర్త్ డే స్పెషల్ - ఫోటోలు చూశారా?
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శ్రీముఖి... బర్త్ డే స్పెషల్ - ఫోటోలు చూశారా?
Renault Mini Duster: 30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Embed widget