అన్వేషించండి
Harish Rao: దరఖాస్తులు పేరిట దగా! ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని హరీశ్‌రావు విమర్శలు
Ration Cards: కొత్త రేషన్‌కార్డులకు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంపై హరీష్‌రావు మండిపడ్డారు. ప్రజాపాలన,గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా అంటూ నిలదీశారు

మాజీమంత్రి హరీశ్‌రావు
Source : X
Harish Rao: ఐదు హమీల పేరిట గద్దెనెక్కిన కాంగ్రెస్( Congress)..ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు( Harish Rao) విమర్శించారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నాళ్లు నాటకాలు ఆడతారంటూ ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర్అయ్యారు.
హరీష్ విమర్శలు
రేషన్‌కార్డులకు మరోసారి ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంపై మాజీమంత్రి హరీష్‌రావు(Harish Rao) ఫైర్ అయ్యారు. దరఖాస్తులతో కాంగ్రెస్ దగా చేస్తోందంటూ మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రజలను మోసం చేస్తారంటూ
ఆయన నిలదీశారు. ప్రజాపాలన పేరిట ఒకసారి దరఖాస్తులు తీసుకున్నారని....కులగణన పేరిట మరోసారి వివరాలు సేకరించారని...ఆ తర్వాత గ్రామసభలు పెట్టి మరోసారి ప్రజలను మభ్యపెట్టారని ఇప్పుడు మళ్లీ మీ- సేవా (Mee Seva)కేంద్రాల్లో ధరఖాస్తులు తీసుకుంటామంటున్నారని హరీష్‌రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారు ఒకసారి ధరఖాస్తు చేసుకుంటే సరిపోదా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నిసార్లు ఇవ్వని రేషన్‌కార్డులుు...ఇప్పుడు మీసేవా కేంద్రాల్లో ధరఖాస్తు చేసుకుంటే ఇస్తారా అని ప్రశ్నించారు. అప్పుడు లేని అర్హతలు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తాయని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనన్న సంగతి ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
గ్రామసభలకు విలువ లేదా
అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలు అమలు చేస్తున్నామంటూ హడావుడి చేసిన ప్రజాపాలన(Praja Paalana) పేరిట దరఖాస్తులు తీసుకున్నారని...ఆ తర్వాత వాటిపై గ్రామసభలు(Grama Sabhalu) సైతం నిర్వహించారని...ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించడం అంటే నాటి ప్రజాపాలన దరఖాస్తులకు, గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేనట్లేనా అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్(KCR) హయాంలో ఎలాంటి దరఖాస్తు,దస్త్రం లేకుండానే తెలంగాణ(Telangana)లో పథకాలు అమలు చేశామంటూ ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో మాత్రం దరఖాస్తుల పేరిట ప్రజలను మభ్యపెట్టడం తప్ప...ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
ప్రభుత్వానికి నిజంగా సాయం చేసే ఉద్దేశమే ఉంటే...ఇన్నిసార్లు దరఖాస్తులు కోరి గందరగోళం సృష్టించేది కాదన్నారు. పేదలకు రేషన్‌కార్డులు(Ration Cards), సంక్షేమ పథకాలు అందించాలన్నఆలోచన కన్నా...కోతలు పెట్టాలన్న ఆలోచన ఎక్కువగా ఉందని హరీష్‌రావు విమర్శించారు.
దరఖాస్తుల పేరిట ఇప్పటికే 14 నెలల కాలం వెళ్లదీశారని...ఇంతకు మించి కాంగ్రెస్ సాధించింది ఏమీ లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు,సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఎన్నికల ముందు చెప్పినట్లుగా రేషన్‌కార్డులు, ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి తీరారని హరీష్‌రావు డిమాండ్ చేశారు. నిరుపేదలు ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటే ఎలలా చేకుంటారని ఆయన ప్రశ్నించారు. నిరక్ష్యరాస్తులు ఎన్నిసార్లు ఇతరులను బ్రతిమాలుకుని దరఖాస్తులు చేసుకోవాలని నిలదీశారు.
ఐదు హామీలు అమలు పేరిట ఎన్నికల ముందు కాంగ్రెస్ వాగ్దానం చేసి గద్దెనెక్కింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు సహా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ పథకాలను అమలు చేయగా...రైతులకు ఎంతో కీలకమైన రూ.2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని రద్దు చేశారు. గణతంత్ర కానుకగా రైతులఖాతాల్లో భరోసా నిధులను జమ చేశారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత కొత్త రేషన్‌కార్డులను జారీ చేశారు.గ్రామసభలు పెట్టి మరీ అర్హుల జాబితా ప్రకటించారు.అయితే చాలామందికి అర్హతలు ఉండికూడా రేషన్‌కార్డులు అందకపోవడంతో...ఈసారి మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఇప్పటికీ అర్హతలు ఉండి రేషన్ కార్డు రాని వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















